
- ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ
కామారెడ్డి, వెలుగు: కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని, వారి అభ్యున్నతికి కృషి చేస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ అన్నారు. శుక్రవారం మాచారెడ్డి, పాల్వంచ మండలాల్లో నిర్వహించిన పనుల జాతర కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. సర్దాపూర్ తండా, నెమిలిగుట్ట తండా, మర్రి తండా, గుంటి తండా, వడ్డెర కాలనీ, వెనుక తండా, వాడి గ్రామాల్లో పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో సమస్యలు పట్టించుకోకపోవడంతో ప్రజలు మనోవేదనకు గురయ్యారన్నారు. పేదల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని,
సొంతింటి కలను సాకారం చేస్తున్నామన్నారు.
మహిళా సమాఖ్యలకు రుణాలు ఇవ్వడమే కాకుండా వడ్డీ రాయితీ కల్పిస్తున్నామన్నారు. కొత్త రేషన్‌కార్డులు జారీ చేసి, సన్నబియ్యం ఇస్తున్నామన్నారు. మాజీ ఎంపీపీ నర్సింగ్‌రావు, నాయకులు పల్లె రమేశ్‌గౌడ్, గణేశ్‌నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్లు లక్ష్మి, రాజు, వైస్ చైర్మన్ బ్రహ్మానందరెడ్డి, ప్రతినిధులు సుతారి రమేశ్, ఇంద్రాసేనారెడ్డి, రాజు, రమేశ్ పాల్గొన్నారు.