గాంధీభవన్ వద్ద షబ్బీర్ అలీకి అనుకూలంగా ఫ్లెక్సీలు

గాంధీభవన్ వద్ద షబ్బీర్ అలీకి అనుకూలంగా ఫ్లెక్సీలు

హైదరాబాద్, వెలుగు:  కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీకి అనుకూలంగా గాంధీభవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బుధవారం ఫ్లెక్సీలు వెలవడం పీసీసీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కామారెడ్డి నియోజకవర్గంలో షబ్బీర్ అలీ వర్గానికి, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరిన చంద్రశేఖర్ రెడ్డి వర్గానికి మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. చివరకు ఈ విభేదాలు గాంధీభవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరాయి. ఈ క్రమంలోనే షబ్బీర్ అలీకి అనుకూలంగా అక్కడ ఫ్లెక్సీలు వెలవడం పార్టీ నేతల్లోచర్చకు దారితీసింది.

‘‘నిజం ఎప్పటికీ మరుగున పడదు’’, ‘‘నిజమైన నాయకుడిని ఎవరూ తక్కువ చేయలేరు’’, ‘‘ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించిన చాపియన్ షబ్బీర్ అలీ’’ అంటూ రాసి ఉన్న ఈ ఫ్లెక్సీలను గాంధీభవన్ ఆవరణలో, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. వీటిపై పార్టీ కార్యకర్తలు గ్రూపులుగా చేరి చర్చించుకోవడం గాంధీభవన్ ఆవరణలో కనిపించింది. ఇటీవల షబ్బీర్ అలీ సొంత పార్టీ నేతలపైనే కొన్ని వ్యాఖ్యలు చేసిన  వీడియో బయటకు రావడం తెలిసిందే.