జొహనెస్‌బర్గ్: సౌతాఫ్రికా విమెన్స్ జట్టు పేసర్ షబ్నిమ్ ఇస్మాయిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రకటించిన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంది. ఫలితంగా వచ్చే నెలలో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌లో ఆడేందుకు రెడీ అయ్యింది.
ఈ మెగా టోర్నీ కోసం సౌతాఫ్రికా ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 37 ఏళ్ల ఇస్మాయిల్‌కు చోటు కూడా లభించింది. 2023 కేప్‌టౌన్‌లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఇస్మాయిల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పింది. కెరీర్‌లో 113 టీ20లు ఆడిన ఇస్మాయిల్ 123 వికెట్లు తీసింది.
