ఓల్డ్ హై వేకు ప్లాంటేషన్ చేయండి : వీర్లపల్లి శంకర్

ఓల్డ్ హై వేకు ప్లాంటేషన్ చేయండి : వీర్లపల్లి శంకర్

షాద్ నగర్,వెలుగు: పాత జాతీయ రహదారి 5 కిలోమీటర్ల మేర ప్లాంటేషన్ చేయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచించారు. మంగళవారం ఆర్అండ్ బీ అధికారులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. హై వే రోడ్డు ప్రొఫైల్ నమూనాపై ఆర్అండ్ బీ అధికారి రవీందర్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యాధునిక పద్ధతుల్లో  పాత జాతీయ రహదారి స్థానిక చౌరస్తా నుంచి రాయికల్ గేట్ వరకు తీర్చిదిద్దాలని సూచించారు. 

రోడ్డుకు మధ్యలో ఆరు ఫీట్లతో మీడియం ప్లాంటేషన్ ఏర్పాటు చేయాలన్నారు. త్వరగా పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆర్అండ్ బీ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.