- ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్ నగర్, వెలుగు: అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో బలిజరాళ్ల తండా, బాల్య తండాలో బీటీ రోడ్లు, మంచినీటి శుద్ధి కేంద్రం, కొత్తపేట ఎస్సీ కాలనీలో డ్రైనేజీ పనులను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తోందని, అభివృద్ధికి సహకరిస్తే పనులు త్వరగా పూర్తవుతాయని చెప్పారు.