టీమిండియా మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మను ఐసీసీ అవార్డు వరించింది. అంతర్జాతీయ క్రికెట్ లో సత్తా చాటి 2025 నవంబర్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకుంది. భారత్ వేదికగా జరిగిన 2025 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో షెఫాలీ ప్రదర్శనకు గాను ఈ అవార్డు దక్కింది. మెన్స్ విభాగంలో సౌతాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ నవంబర్ నెలకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. టీమిండియాపై ఇటీవలే జరిగిన రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 8.94 యావరేజ్ తో 17 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు.
ఈ అవార్డు నా సహచరులు, కోచ్‌లు, కుటుంబానికి అంకితం:
"నా తొలి ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచ కప్ అనుభవం నేను ఊహించినట్లుగా జరగలేదు. కానీ నేను ఎప్పుడూ కోరుకున్న దానికంటే లేదా ఊహించిన దానికంటే చాలా బాగా ముగిసింది. ఫైనల్లో జట్టు విజయానికి నేను సహకరించినందుకు సొంతగడ్డపై ఫ్యాన్స్ ముందు ప్రపంచ కప్ గెలవడంలో చరిత్ర సృష్టించడంలో నేను భాగం కాగలిగినందుకు సంతోషంగా ఉంది. నవంబర్ నెలలో మహిళా క్రీడాకారిణిగా ఎంపిక కావడం నాకు నిజంగా గౌరవంగా ఉంది. ఈ అవార్డును నా సహచరులు, కోచ్‌లు, కుటుంబం, ఇప్పటివరకు నా ప్రయాణానికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ అంకితం చేస్తున్నాను". అని అవార్డు గెలుచుకున్న తర్వాత షెఫాలీ వర్మ చెప్పుకొచ్చింది.
వరల్డ్ కప్ ఫైనల్లో బ్యాటింగ్, బౌలింగ్ లో అదుర్స్:
ఆదివారం (నవంబర్ 2) సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో బ్యాటింగ్ లో అదరగొట్టింది. 78 బంతుల్లోనే 87 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడింది. షెఫాలీ ఇన్నింగ్స్ లో 7 ఫోర్లతో పాటు 2 సిక్సర్లున్నాయి. బ్యాటింగ్ లో ఆకట్టుకున్న షెఫాలీ ఆ తర్వాత తన స్పిన్ తో మాయాజాలం చేసి మ్యాచ్ ను భారత జట్టు వైపుకు తిప్పింది. 20 ఓవర్లో సునే లూస్ ఔట్ (25) చేసి 52 పరుగుల భాగస్వామ్యాన్ని విడగొట్టిన షెఫాలీ..ఆ తర్వాత తాను వేసిన ఓవర్లో మారిజాన్ కాప్ ను 4 పరుగుల వద్ద పెవిలియన్ కు పంపింది. 2 వికెట్ల నష్టానికి 114 పరుగులతో పటిష్టంగా ఉన్న సౌతాఫ్రికా షెఫాలీ ధాటికి రెండు కీలక వికెట్లు చేజార్చుకొని 4 వికెట్ల నష్టానికి 123 పరుగులతో నిలిచింది. షెఫాలీ ఆల్ రౌండ్ ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
షెఫాలీ ఆల్ రౌండ్ షో తో ఇండియాకు వరల్డ్ కప్:
ఆదివారం (నవంబర్ 2) ముంబైలోని డీవై పాటి స్టేడియంలో జరిగిన ఈ మెగా ఫైనల్ మ్యాచ్ లో ఓపెనర్ షెఫాలీ వర్మ (78 బాల్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 87; 2/36), దీప్తి శర్మ (58 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 58; 5/39) ఆల్‌రౌండ్ మెరుపులతో హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని టీమిండియా 52 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 298/7 స్కోరు చేసింది.అనంతరం ఛేజింగ్‌లో సఫారీ టీమ్ 45.3 ఓవర్లలో 246 రన్స్‌కే ఆలౌటై ఓడింది. కెప్టెన్ లారా వోల్‌వార్ట్ (98 బాల్స్‌లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 101) సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. షెఫాలీకి ప్లేయర్ ఆఫ్ మ్యాచ్, దీప్తికి ప్లేయర్ అఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి.
Shining bright on the biggest of stages 👏
— BCCI Women (@BCCIWomen) December 15, 2025
Congratulations to #TeamIndia's Shafali Verma on being named the ICC Women's Player of the Month for November 2025 🙌@TheShafaliVerma pic.twitter.com/Oht970ah4p
