థ్రెట్ ఉందా.. ? : షారూఖ్ ఖాన్ కు.. దేశంలో పెద్ద సెక్యూరిటీ.. కమాండోల రక్షణలో

థ్రెట్ ఉందా.. ? : షారూఖ్ ఖాన్ కు.. దేశంలో పెద్ద సెక్యూరిటీ.. కమాండోల రక్షణలో

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah rukh khan) కు మహారాష్ట్ర ప్రభుత్వం వై ప్లస్‌(Y+) భద్రతను ఏర్పాటు చేసింది. ఈమేరకు మహారాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. షారుఖ్ ఖాన్ నటించిన గత రెండు సినిమాలు పఠాన్(Pataan), జవాన్(Jawan) సినిమాలు పాన్ ఇండియా లెవల్లో సూపర్ హిట్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫిస్ దగ్గర రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. దీంతో షారుఖ్ కు బెదిరింపు కాల్స్, డెత్ నోట్స్ అధికం అయ్యాయి. షారుఖ్ ను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుండి బెదిరింపు కాల్స్ అందాయి. ముంబైలో ఆయన ఇంటికి తరచూ డెత్ నోట్స్ వస్తున్నాయి.

దీంతో.. షారుఖ్ ఖాన్ ఇప్పటికే ముంబై పోలీసులకు (Mumbai Police) ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలంటూ కోరారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం.. ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంది. షారుఖ్ ఖాన్‌కు వై ప్లస్‌ భద్రతను కల్పిస్తూ మహారాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

వై ప్లస్ భద్రత అంటే ఏంటి?

వై ప్లస్ భద్రతలో మొత్తం 11 మంది రక్షణగా ఉంటారు. ఇందులో ముగ్గురు, నలుగరు కమాండోలు ఉంటారు. వీరు 24 గంటలపాటు సదరు వ్యక్తికి  కాపలాగా ఉంటారు. వీళ్ళు మూడు షిఫ్టుల్లో పని చేస్తారు.. దీని కోసం నెలకు 15 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇక షారూఖ్ ఎక్కడికైనా వెళితే.. అక్కడి లోకల్ పోలీసులు కూడా ఆయనకు భద్రతా ఏర్పాట్లు చేస్తారు.