
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్(Shah rukh khan) లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జవాన్(Jawan)’. తమిళ దర్శకుడు అట్లీ కుమార్(Atlee kumar) తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ కు ముందే రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్పటికే మ్యూజిక్ రైట్స్ విషయంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన జవాన్.. తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంకా ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే.. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.250 కోట్లకు అమ్ముడు కావటం విశేషం
షారుక్ గత చిత్రం పఠాన్(Patan) బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఏనగా రూ.1000 కోట్లు కలెక్ట్ చేసి షారుక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీంతో ఆ ఎఫెక్ట్ జవాన్ మూవీపై పడింది. అందుకే జవాన్‌పై క్రేజీ బజ్ క్రియేట్ అయ్యింది. ఇవన్నీ చూస్తుంటే షారూక్ ఖాన్‌కి నేషనల్ వైడ్ గా ఉన్న క్రేజ్ ఎంటనేది స్పష్టమవుతోంది.
ALSO READ :హాలిడే ట్రిప్ లో చిరు.. వచ్చాక కామెడీ టచ్‌తో మూవీ షురూ
ఇక జవాన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ‘మిషన్ ఇంపాజిబుల్(Mission impossible)’ సినిమా థియేటర్స్‌లో ప్రదర్శించబోతున్న సంగతి తెలిసిందే. విడుదలకు ముందే ఈ రేంజ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా.. విడుదల తరువాత ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.