
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ (Shahrukh khan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ డంకీ (Dunki). క్రిస్మస్ స్పెషల్ గా డిసెంబర్ 21 న వస్తోన్నఈ మూవీని స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ (Rajkumar hirani) డైరెక్ట్ చేశారు. సలార్ మూవీకి పోటీగా రిలీజ్ కానున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.
లేటెస్ట్గా ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ షారుఖ్ ఫ్యాన్స్ను కలవరపెడుతోంది.ఈ డంకీ సినిమాను కేవలం 15 ఏళ్ల వయస్సు పైబడిన వారు మాత్రమే థియేటర్లలో చూసేందుకు వెసులుబాటు ఉంది. షారుక్ ఖాన్ సినిమాలంటే ఇప్పుడు ఉన్న యూత్ లో మంచి పట్టు ఉంది. రీసెంట్ గా రిలీజైన జవాన్ మూవీని ఎక్కువగా యూత్ థియేటర్లో సందడి చేసి రూ.1000 కోట్ల దిశగా నడిపించారు. దీంతో షారుఖ్ ఫ్యాన్స్ బాగా డిస్సపాయింట్ అయ్యారు.
కానీ, ప్రస్తుతం డంకీ విషయంలో కారణం లేకపోలేదు. ఎందుకంటే, ఈ సినిమాలో పెచ్చుమీరిన హింస, యాక్షన్ కంటెంట్, అతి వివక్షత ఎక్కువగా చూపించడమే. అందుకు అనుగుణంగానే బ్రిటిష్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ క్లాసిఫికేషన్ అయిన BBFC 15 + రేటింగ్ ఇచ్చింది. ఈ రేటింగ్ కు అర్ధమేంటంటే 15 ఏళ్ళ వయస్సు మించిన వారికి మాత్రమే అని వెల్లడించింది.
#Dunki rated 15 by BBFC.
— Gulte (@GulteOfficial) December 18, 2023
Four friends from a small Punjab village embark on a treacherous journey to England without a visa in this Hindi language comedy drama which includes occasional bloody images, upsetting scenes and discrimination.#ShahRukhKhan #RajkumarHirani pic.twitter.com/tyLHQH7sP0
షారుఖ్ సినిమాతో రిలీజైన మరునాడే (డిసెంబర్ 22 న) వస్తోన్న సలార్ లో కూడా హింస, రక్తపాతం ఎక్కువగా చూపించారు. దీనికి కారణంగా BBFC సలార్ కు 18+ రేటింగ్ ఇచ్చారు. సలార్ తో పోలిస్తే ఇప్పుడు డంకీని కూడా హింస విద్వేషం పరంగా తక్కువగా చూడలేని పరిస్థితి ఏర్పడిందంటూ ఫ్యామిలీ ఆడియన్స్ వాపోతున్నారు. ఏదీ ఏమైనప్పటికీ..రాజ్ కుమార్ హిరానీ,ప్రశాంత్ నీల్ సినిమాలకు ఉన్న క్రేజ్ ను ఎవ్వరూ ఆపలేనిదనే చెప్పుకోవాలి.
డంకీ సినిమా కథ విషయానికి వస్తే..
పంజాబ్ లోని ఒక పల్లెటూరిలో నివశించే నలుగురు స్నేహితులు. వారికి ఇంగ్లాండ్ వెళ్లాలనే కోరిక ఉంటుంది. కానీ వారికి టిక్కెట్,వీసా లభించవు. దాని కోసం చాలా ప్రయత్నిస్తారు. చివరికి వారికీ సహాయం చేయడానికి ఓ సైనికుడు ముందుకు వస్తాడు. అలా మొదలైన వారి ఇంగ్లాండ్ ప్రయాణం, ఆ ప్రయాణంలో వారు ఎదుర్కొన్న సమస్యలతో టీజర్, ట్రైలర్ లో చూపించారు. ఈ సినిమాలో కామెడీ డ్రామాతో పాటు హింస, రక్తపాతం, కలతపెట్టే సన్నివేశాలు, వివక్ష కూడా ఉంటాయి. అంతేకాకుండా.. తుపాకీ బెదిరింపులు, వివక్ష, లైంగిక హింస కూడా ఉండబోతుందని తెలుస్తోంది.ముఖ్యంగా మగువలపై బలాత్కారాలు ఇందులో చూపించడం వల్ల ఆ సన్నివేశాలు కలవరపెట్టేవిగా ఉన్నాయిని BBFC ఆడియన్స్ కు సూచించింది.