షారూఖ్ ఇంటి నేమ్ ప్లేట్ మాయం ?

షారూఖ్ ఇంటి నేమ్ ప్లేట్ మాయం ?

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. మూడు దశాబ్దాలుగా పరిశ్రమను శాసిస్తూ.. లక్షలాది ప్రేక్షకుల హృదయాల రారాజుగా వెలుగొందారు. ఇతని కుటుంబం నివాసం ఉంటున్న ‘మన్నత్’ చూడటానికి ఎంతో మంది వస్తుంటారు. అక్కడ ఫొజులిస్తూ.. ఫొటోలు దిగుతుంటారు. మన్నత్ ముందట ఉండే నేమ్ ప్లేట్ మిస్ అయ్యిందని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. ఎందుకంటే ఓ అభిమాని ఇంటి ముందు వీడియో తీసుకుని.. ట్విట్టర్ లో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. నేమ్ ప్లేట్ ‘మన్నత్’ కనిపించలేదని, షారూఖ్ ఇంటికి వెళ్లిన సమయంలో తన జీవితంలో మొదటిసారిగా అక్కడ ప్లేట్ లేదని తెలిపాడు.

కొందరు అది చోరీకి గురైందని నెటిజన్లు కామెంట్స్ చేశారు. కొంతమంది మాత్రం భద్రతా కారణాల రీత్యా దానిని తొలగించడం జరిగిందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆ నేమ్ ప్లేట్ ను రిపైర్ చేస్తున్నట్లు.. మరమ్మత్తులు పూర్తయిన అనంతరం అక్కడనే దానిని ఉంచుతారని షారూఖ్ కు సన్నిహితంగా ఉండే వారు వెల్లడిస్తున్నట్లు సమాచారం. నేమ్ ప్లేట్ తయారు చేయడానికి సుమారు రూ. 25 లక్షలు వెచ్చించారని బాలీవుడ్ వర్గాల అంచనా.  బంగ్లా యొక్క నేమ్ ప్లేట్ ను షారూఖ్ సతీమణి గౌరీ ఖాన్ డిజైన్ చేశారని తెలుస్తోంది. కుటుంబస్థాయికి ఏదైనా గౌరవంగా ఉండాలనే ఉద్ధేశ్యంతో దీనిని తయారు చేయించారని అంటారు. 

మరోవైపు వెండి తెరపై షారూఖ్ కనిపించకుండా మూడు సంవత్సరాలు అవుతోంది. జీరో సినిమా అనంతరం ఆయన నుంచి ఇప్పటి వరకు ఏ మూవీ రాలేదు. పఠాన్ సినిమా ఒప్పుకున్నా.. కరోనా వల్ల ఆలస్యమైంది. షారూఖ్ తనయుడు డ్రగ్స్ కేసులో పట్టుబడడంతో ఈ సినిమా మరింత ఆలస్యమైంది. ఇటీవలే అతని తనయుడు ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ లభించింది. కొన్ని రోజుల క్రితమే పఠాన్ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. 2023, జనవరి 25న బిగ్ స్క్రీన్ పై కలుకుందాం అంటూ బాద్ షా పోస్టు చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. 
 

మరిన్ని వార్తల కోసం : -

దీపిక..డ్రెస్సింగ్ సెన్స్


జైపూర్‌‌లో ‘మేజర్’ సినిమా ప్రివ్యూ