అవన్నీ ఒట్టి మాటలే.. మొదటిసారి పాక్ క్రికెటర్ నోట నిజాలు

అవన్నీ ఒట్టి మాటలే.. మొదటిసారి పాక్ క్రికెటర్ నోట నిజాలు

ఆస్ట్రేలియాతో మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా పాకిస్థాన్ 0-3 తేడాతో వైట్ వాష్ అయింది. ఇటీవలే భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ తర్వాత పాక్ ఆడిన తొలి సిరీస్ ఇది. వరల్డ్ కప్ లో సెమీస్ కు చేరడంలో విఫలమైన పాక్.. ఆసీస్ తో సిరీస్ కు ముందు జట్టును ప్రక్షాళన చేసింది. చీఫ్ సెలక్టర్ గా వహాబ్ రియాజ్, డైరెక్టర్ గా మహమ్మద్ హఫీజ్ ను నియమించిన పాక్ క్రికెట్ బోర్డు.. మూడు ఫార్మాట్ లకు ముగ్గురు కెప్టెన్లను నియమించింది. పాక్ క్రికెట్ లో ఇన్ని భారీ మార్పులు జరిగినా పరాజయాలు వెంటాడుతూనే ఉన్నాయి. 

ఆస్ట్రేలియాతో సిరీస్ గెలుస్తామని బీరాలు పలికిన హఫీజ్ పరువు పోగొట్టుకున్నాడు. తాజాగా పాక్ క్లీన్ స్వీప్ కావడానికి షహీన్ అఫ్రిది అసలు కారణం చెప్పేశాడు. ఆస్ట్రేలియాలో తాము సిరీస్ ఓడిపోవడానికి ప్రధానంగా పేస్ బౌలర్లే అని చెప్పాడు. గంటకు 140-145 వేగంతో బంతులు వేయాల్సిన పిచ్ పై పాక్ పేసర్లు 132-133 వేగంతో మాత్రమే బౌలింగ్ చేశారని అఫ్రిది తెలియజేశాడు. అఫ్రిది ఇలా చెప్పడంతో భారీగా ట్రోలింగ్ కు కారణమయ్యాడు. తాను ఒక ప్రధాన పేసర్ అయి ఉండి వేగంగా బౌలింగ్ చేయలేకపోయామని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది. 

మెరుపు వేగంతో బంతులు వేయగల అఫ్రిది..ఇలాంటి చెత్త కారణం చెప్పడంతో ఈ లెఫ్టర్మ్ సీమర్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు. పాక్ ఆటగాళ్ల తొలిసారి నిజాలు చెప్పారని కామెంట్స్ చేస్తున్నారు. వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ఓటమికి DRS కారణం చెప్పగా.. మిక్కీ ఆర్డర్ ఇది ఐసీసీ టోర్నీలా లేదు బీసీసీఐ టోర్నీల ఉందని షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఇక ఆ దేశ అభిమానులైతే భారత ప్రేక్షకుల మీద, పిచ్ ల మీద నిందలు వేశారు. అయితే అఫ్రిది తమ బౌలర్లు వేగంగా బంతులు వేయలేకపోయారని చెప్పడంతో పాక్ ఓటములకు అసలు కారణం తెలిసిపోయిందని నెటిజన్స్ సెటైర్లు వేస్తున్నారు.