Cricket World Cup 2023: మ్యాచ్ అయ్యాక కనపడు.. 5 వికెట్లు తీశాక సెల్ఫీ ఇస్తా: అభిమానితో ఆఫ్రిది

Cricket World Cup 2023: మ్యాచ్ అయ్యాక కనపడు.. 5 వికెట్లు తీశాక సెల్ఫీ ఇస్తా: అభిమానితో ఆఫ్రిది

వరల్డ్ కప్ లో భాగంగా భారత్ -పాకిస్థాన్ మ్యాచ్ చూసేందుకు నెలలు, రోజులు పోయి ఇప్పుడు గంటలు లెక్కించుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ హై వోల్టేజ్ మ్యాచు కోసం బీసీసీఐ ఏర్పాట్లన్నీ పూర్తి చేయగా.. ఇరు జట్లు మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకున్న ఇండియా, పాకిస్థాన్ తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. నెట్స్ లో చెమటోడుస్తూ  ప్రాక్టీస్ లో మునిగి తేలాయి. ఇక ఈ మ్యాచు జరగకముందే పాకిస్థాన్ పేసర్ షహీన్ ఆఫ్రిది భారత్ పై వికెట్లు తీస్తానని ఛాలెంజ్ చేసాడు.
 
ప్రాక్టీస్ సమయంలో పాక్ ఆటగాళ్లు ఎక్కువగా ఫీల్డింగ్ మీద దృష్టి పెడుతూ కనిపంచారు. ఈ క్రమంలో ఫీల్డింగ్ ముగించుకొని వెళ్తున్న పాక్ పేసర్ అఫ్రిది సెల్ఫీ కోసం బౌండరీ దగ్గర అభిమానులు ఎగబడ్డారు. దీనికి షాహీన్ భారత్ తో మ్యాచులో 5 వికెట్లు తీసిన తర్వాతే నీకు సెల్ఫీ ఇస్తాను అని చెప్పుకొచ్చాడు. షాహీన్ మంచి బౌలరే అయినా.. భారత్ పై మెరుగైన రికార్డ్ ఉన్నా ఈ  కామెంట్స్ చేయడం కాస్త ఓవర్ అనిపించింది. టీ 20 వరల్డ్ కప్ లో, ఆసియా కప్ లో భారత బ్యాటర్లపై ఆధిపత్యం చూపించిన షాహీన్ ఈ మ్యాచులో తాను అనుకున్నట్లుగా 5 వికెట్లు తీస్తాడో లేదో చూడాలి. 

ఇక ఈ రెండు జట్ల మధ్య వన్డే వరల్డ్ కప్ రికార్డ్ పరిశీలిస్తే భారత్ 7-0తో స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. వరల్డ్ కప్ అంటే పాక్ పై పూనకం వచ్చేట్టుగా ఆడే మన జట్టు మరోసారి గెలిచి ఆ ఆధిక్యాన్ని పెంచాలని చూస్తుంటే.. పాక్ మాత్రం భారత్ పై వరల్డ్ కప్ లో తొలి విజయాన్ని నమోదు చేసుకోవాలని భావిస్తుంది. అక్టోబర్ 14 న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. 

m*/ .bp-doc .pdfViewer .page:not(.bp-is-invisible):before { display: none; } /*telegram*/ .web_telegram_org .emoji-animation-container { display: none; } /*ladno_ru*/ .ladno_ru [style*="position: absolute; left: 0; right: 0; top: 0; bottom: 0;"] { display: none !important; } /*mycomfyshoes.fr */ .mycomfyshoes_fr #fader.fade-out { display: none !important; } /*www_mindmeister_com*/ .www_mindmeister_com .kr-view { z-index: -1 !important; } /*www_newvision_co_ug*/ .www_newvision_co_ug .v-snack:not(.v-snack--absolute) { z-index: -1 !important; } /*derstarih_com*/ .derstarih_com .bs-sks { z-index: -1; }