కరీనాతో ముద్దు.. కెరీర్​ పాడుచేసుకున్న హీరో

కరీనాతో ముద్దు.. కెరీర్​ పాడుచేసుకున్న హీరో

బాలీవుడ్​ తార కరీనా కపూర్(Kareena Kapoor)​ పరిచయం అక్కరలేని పేరు. ఓ టైంలో హీరో షాహిద్​ కపూర్(Shahid Kapoor)​తో ఆమె ప్రేమాయణం ఇండస్ట్రీలో హాట్​ టాపిక్​ అయ్యింది. వీరిద్దరి లిప్​లాక్​ సీన్​ ఒకటి లీకై ఇండస్ట్రీని షేక్​ చేసింది. ఆ తర్వాత ఇద్దరూ బ్రేకప్​ చెప్పుకోవడం.. మళ్లీ ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకోవడం జరిగిపోయాయి. కానీ, ఇప్పటికీ ఈ విషయం చర్చకు వస్తే కరీనాపై షాహిద్​ ఫ్యాన్స్​ విరుచుకుపడుతుంటారు.

ఆమెతో అఫైర్​ కారణంగానే షాహిద్​ స్టార్​డంను అందుకోలేకపోయాడని చెప్తుంటారు. ఇప్పుడు మరోసారి ఈ అంశం బాలీవుడ్​ మీడియాలో వైరలవుతోంది. తాజాగా షాహిద్​ కపూర్​ ఈ విషయంపై షాకింగ్​ కామెంట్స్​ చేయడమే ఇందుకు కారణం.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కరీనాతో ఆ ఎంఎంఎస్​ వీడియో తనను తన కెరీర్​ను నాశనం చేసిందన్నాడు. 24 ఏళ్ల వయసులో తెలియక చేసిన తప్పు తన జీవితాన్ని కుదిపేసిందని తెలిపాడు.