ఇతను షారుఖ్ ఖాన్ కాదు.. నమ్మరా?.. అయితే ఇది చూడండి

ఇతను షారుఖ్ ఖాన్ కాదు.. నమ్మరా?.. అయితే ఇది చూడండి

ఈ భూమిపై మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ఇతన్ని చూస్తే నిజమే అనిపిస్తోంది కదా. అచ్చ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్‌ను పోలిన ఈ మనిషి ముంబయి స్ట్రీట్స్‌లో డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ALSO READ :గాయత్రీ గుప్తాకు ఏమైంది?.. ట్రీట్మెంట్ కోసం విరాళాలు అడుగుతుందా? 

అతని పేరు ఇబ్రహీం ఖాద్రీ. వయసు వయసు 57 సంవత్సరాలు. అచ్చం షారుఖ్ లా ఉండే ఇతనికి సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది. ఇతనికి ఇంస్టాలో 8.81 లక్షల ఫాలోవర్స్‌ ఉన్నారు. షారుఖ్ పాటలకు డాన్స్ చేస్తూ ఆయన చేసే వీడియోలు ఫుల్ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఈ డూప్ షారుఖ్ ముంబయి వీధుల్లో జవాన్ పాట చలేయా పాటకు డాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు.
 

ఈ వీడియోను చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. డూప్లికేట్ షారుఖ్.. అచ్చంగా షారుఖ్ లా ఉన్నారు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు.. షారుఖ్ మిమ్మల్ని చూస్తే కచ్చితంగా ఇంప్రెస్ అవుతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక జవాన్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో నయనతార,దీపికా పాడుకొనే,విజయ్ సేతుపతి వంటి స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించారు.