
యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి గాయత్రి గుప్తా.. ఆ తర్వాత సినిమాల్లో నటించి ఆడియన్స్ కు దగ్గరైంది. అంతేకాదు యూట్యూబ్ ఛానెల్స్ కు ఆమె ఇచ్చిన బోల్డ్ ఇంటర్వూస్ కూడా చాలా ఫెమస్ అయ్యాయి. ఇక సోషల్ మీడియాలో కూడా ఫొటోలు, వీడియోలు, షేర్ చేస్తూ బోల్డ్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది.
ALSO READ :ఇతను షారుఖ్ ఖాన్ కాదు.. నమ్మరా?.. అయితే ఇది చూడండి
ఎప్పుడు చలాకీగా కనిపించే గాయత్రి గుప్తా.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్యంపై సంచలన కామెంట్స్ చేసింది. ఇంటర్వ్యూ భాగంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం నా హెల్త్ కండిషన్ అస్సలు బాలేదు. రేపు ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు. డాక్టర్స్ కు చూపిస్తే ఆపరేషన్ చేయాలి అన్నారు. ట్రీట్మెంట్ కు 10 లక్షలపైనే అవుతాయన్నారు కానీ.. నా దగ్గర అంత అమౌంట్ లేదు. అందుకోసం విరాళాలు సేకరించాలని అనుకుంటున్నాను.. అని చెప్పుకొచ్చింది. గాయత్రీ గుప్తా అలా మాట్లాడటంతో ఆది చూసిన ఆడియన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆమె అనారోగ్యం ఏంటి? అందుకోసం విరాళాలు సేకరించడం ఏంటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూశాక ఐనా ఎవరైనా ఆమె ట్రీట్మెంట్ కు మనీ అరేంజ్ చేస్తారా అనేది చూడాలి.