CPL 2025: రివర్స్ స్వీప్ చేయబోతే హిట్ వికెట్ ఔట్.. పరువు పోగొట్టుకున్న విండీస్ స్టార్ ప్లేయర్‌

CPL 2025: రివర్స్ స్వీప్ చేయబోతే హిట్ వికెట్ ఔట్.. పరువు పోగొట్టుకున్న విండీస్ స్టార్ ప్లేయర్‌

ప్రస్తుత క్రికెట్ లో ఇన్నోవేటివ్ షాట్స్ చాలా కామన్ అయిపోయాయి. బౌలర్లు కూడా విచిత్ర షాట్స్ ట్రై చేస్తూ బౌండరీలు రాబడతారు. ఈ క్రమంలో కొన్ని షాట్స్ ప్రేక్షకులని థ్రిల్ కు గురి చేస్తాయి. అయితే వెస్టిండీస్ స్టార్ ప్లేయర్, కెప్టెన్ షాయ్ హోప్ తన షాట్ తో నవ్వుల పాలయ్యాడు. ఎంతో స్టార్ బ్యాటర్ గా పేరున్న హోప్ ఒక చెత్త షాట్ ఆడి అవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఈ సీన్ జరిగింది. అసలేం ఏం జరిగిందో.. హోప్ ఎలా ఔటయ్యాడో ఇప్పుడు చూద్దాం.. 

కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో శనివారం (ఆగస్టు 30) ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, గయానా అమెజాన్ వారియర్స్ మధ్య మ్యాచ్ జరిగింది.  గయానా అమెజాన్ వారియర్స్ ఆడుతున్న హోప్ అప్పటివరకు అద్భుతంగా ఆడుతూ జట్టు స్కోర్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు. 29 బంతుల్లో 39 పరుగులు చేసి క్రీజ్ లో సెట్ అయ్యి ఉన్నాడు. టెర్రెన్స్ హిండ్స్‌ను వేసిన 14 ఓవర్ తొలి బంతికి రివర్స్ స్వీప్ ప్రయత్నించాడు. ఆఫ్ సైడ్ వైడ్ గా వెళ్తున్న బంతిని హోప్ రివర్స్ స్వీప్ తో వెంబడించాడు. బాల్ మరీ దూరంగా వెళ్లడంతో బంతి హోప్ బ్యాట్ కు అందలేదు. 

ఆ సమయంలో ఫుట్ వర్క్ కంట్రోల్ తప్పిన హోప్ తన బ్యాట్ ను వికెట్లకేసి కొట్టాడు. దీంతో రివర్స్ స్వీప్ మిస్ కాగా హిట్ వికెట్ రూపమ్లో ఔటయ్యాడు. అనవసర ప్రయోగాలతో తన వికెట్ చేజార్చుకున్నాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే గయానా అమెజాన్ వారియర్స్ పై ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్  నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ 17.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసి విజయం సాధించింది.