చనిపోలేదు నేను బతికే ఉన్నా

చనిపోలేదు నేను బతికే ఉన్నా

దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలో కూడా షకీలకు ఎంతో గుర్తింపు ఉంది. అయితే.. ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కొన్ని వార్తలు, ఆమె చనిపోయిందని మరికొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై స్పందించిన షకీల..ఇవన్నీ తప్పుడు వార్తలేనని కొట్టిపారేశారు. తాను సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నానంటూ సోషల్ మీడియా ద్వారా  తెలిపారు. 
 
తాను మరణించాననే న్యూస్ చూసి షాక్ అయ్యానని చెప్పారు షకీల. తాను బతికే ఉన్నానని చెప్పారు. తన గురించి ఎవరో తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. ఈ తప్పుడు వార్తలు చూసి ఎంతో మంది తనకు ఫోన్లు చేశారని, మెసేజ్ లు పంపారని చెప్పారు. తనపై ప్రేమను చూపిన అందరికీ ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. తన గురించి తప్పుడు ప్రచారం చేసిన వారికి కూడా థ్యాంక్స్ చెపుతున్నానని... ఎందుకంటే అందరూ తన గురించి ఆలోచించేలా చేశారని చెప్పారు.

శృంగార కథానాయికగా షకీలకు అప్పట్లో భారీ క్రేజ్ ఉండేది. ఆమె నటించిన సినిమాలు హిందీలో కూడా డబ్ అయి ఉత్తరాదిని కూడా ఊపేశాయి. ఆ తర్వాత ఆమె మంచి సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గడంతో టీవీ సీరియళ్లలో నటిస్తున్నారు.