నిబంధనల ప్రకారమే పార్కింగ్ ఫీజులు వసూలు.. శంషాబాద్ ఎయిర్పోర్టు వివరణ

నిబంధనల ప్రకారమే పార్కింగ్ ఫీజులు వసూలు.. శంషాబాద్ ఎయిర్పోర్టు వివరణ

శాంషాబాద్ ఎయిర్ పోర్టులో అదనపు పార్కింగ్ చార్జీల వసూళ్లపై వస్తున్న వార్తలపై స్పందించింది RGIA యాజమాన్యం. నిబంధనల ప్రకారమే పార్కింగ్ ఫీజులు వసూలు చేయనున్నట్లు సోమవారం (జులై 28) ప్యాసెంజర్ అడ్వైజరీ విడుదల చేసింది. ఇచ్చిన టైమ్ కు మించి పార్కింగ్ చేస్తే పోలీసులు చలాన్లు విధిస్తారని సోమవారం (జులై 28) అడ్వైజరీ విడుదల చేశారు. నిమిషం నిమిషానికి ఛార్జీలు వసూళ్లు చేస్తారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది.

ఎయిర్ పోర్ట్ లో పికప్, డ్రాప్ కు సంబంధించి 8 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. గ్రేస్ పీరియడ్ దాటితే చార్జీలు వర్తిస్తాయని శంషాబాద్ రాజీవ్ గాందీ విమానాశ్రయం అధికారులు ప్రకటన విడుదల చేశారు. పీక్ హవర్స్ లో ప్యాసెంజర్లకు ఆలస్యం కాకుండా, తొందరగా చేరుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు . 

►ALSO READ | Tesla: భారత రోడ్లపై టెస్లా కార్ తప్పులు.. సాఫ్ట్‌వేర్ 'దేశిఫై' చేయాలన్న ఓనర్..

ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం కాకుండా.. ప్రయాణీకులు తొందరగా చేరుకునేందుకు ఈ నిబంధనలు పకడ్బందీగా అమలు చేయనున్నట్లు ప్యాసెంజర్ అడ్వైజరీలో పేర్కొన్నారు. వెహికిల్స్ ఎంట్రీ, ఎగ్జిట్ సమయాలను పోలీసులు కౌంట్ చేసుకుంటారని.. టైమ్ పాటించని వెహికిల్స్.. అదే విధంగా పార్క్ చేసి కార్లో లేకుండా గ్రేస్ పీరియడ్ కు మించి వెళ్లే వెహికిల్స్ కు చలాన్లు వేయనున్నట్లు తెలిపారు. నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా సూచించారు.