దళితున్ని చితక్కొట్టిన సీఐపై విచారణకు ఆదేశం

దళితున్ని చితక్కొట్టిన సీఐపై విచారణకు ఆదేశం

హైదరాబాద్: ఫ్లెక్సీ చించివేత వివాదంలో ఇటీవల దళిత యువకుడు శ్రీనివాస్ పై దాడి చేసిన కేశంపేట్ పోలీసుల వైఖరిపై శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి విచారణకు ఆదేశించారు. మూడు రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని షాద్ నగర్ ఏసీపీ కుశాల్కర్ ను ఆదేశించారు. ఈ విషయంపై ఇటీవల టీ-పీసీసీ సెల్ చైర్మన్ నగరి గారి ప్రీతం, వైస్ చైర్మన్ నరేందర్ బాధితుడు శ్రీనివాస్ తో కలిసి డీసీపీ జగదీశ్వర్ రెడ్డిని కలిశారు. అకారణంగా శ్రీనివాస్ ను కొట్టిన కేశంపేట్ సీఐని సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. తమకు న్యాయం జరిగే వరకు సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం దగ్గర ఆందోళన చేపడతామన్నారు పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ నగరి గారి ప్రీతం.