
షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గానికి శంషాబాద్ లిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం సుమారు 50 లక్షల రూపాయల విలువైన నాలుగు అంబులెన్స్లను ఉచితంగా అందజేసింది. నూతన అంబులెన్సులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. లిమ్స్ హాస్పిటల్ వారు తమ వంతు సమాజ సేవ చేయడం ఉదార స్వభావంతో పేదల కోసం ఉచితంగా అంబులెన్సు సర్వీసులను అందజేయడం ఆనందదాయకమన్నారు.
అత్యవసర సమయంలో అంబులెన్సులను ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలన్నారు. ప్రమాద సమయంలో దగ్గరలోని హాస్పిటల్కు ఉచితంగా చేరవేస్తరన్నారు. హాస్పిటల్ ఎండీ రాం రాజ్ మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లోని గోల్డెన్ అవర్స్లో సమయానికి దగ్గరలోని హాస్పిటల్స్కు తరలించడానికి ఈ అంబులెన్సులు ఉపయోగపడతాయన్నారు. తమ వంతు సమాజ సేవ చేసే అవకాశం కల్పించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.