కోహ్లీపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ప్రశంసలు

కోహ్లీపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ప్రశంసలు

విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ ప్రశంసలు కురిపించాడు. అతడి వల్లే టెస్టు క్రికెట్ కు ఆదరణ పెరిగిందన్నాడు. విరాట్ కోహ్లీ గొప్ప కెప్టెన్ అని..అతని ఆట తీరుతో చాలా మందిలో స్ఫూర్తి నింపాడన్నాడు. అతడి టెస్టు కెప్టెన్సీలో భారత జట్టు ఎంతో ఎత్తుకు ఎదిగిందన్నాడు. అతడో అద్భుతమైన క్రికెటర్ అని..ప్రస్తుత టీ20 సీజన్లలో కూడా టెస్టు క్రికెట్ కు ఇంత క్రేజ్ ఉందంటే కారణం కోహ్లీ లాంటి గొప్ప ఆటగాళ్ల వల్లేనన్నాడు. టెస్టుల ద్వారానే ఆటగాళ్ల ప్రతిభ తెలుస్తుందన్నాడు వార్న్. టెస్టు క్రికెట్ ను ప్రోత్సహించడంలో బీసీసీఐ ఎప్పుడూ ముందుంటుందన్నాడు.