షేన్ వార్న్‌‌ బ్యాగీ గ్రీన్‌‌ క్యాప్‌కు వేలంలో రూ.5 కోట్లు

షేన్ వార్న్‌‌ బ్యాగీ గ్రీన్‌‌ క్యాప్‌కు వేలంలో రూ.5 కోట్లు

సిడ్నీ: ఆస్ట్రేలియా బుష్‌‌ఫైర్‌‌ బాధితుల కోసం వేలం వేసిన ఆసీస్‌‌ స్పిన్‌‌ లెజెండ్‌‌ షేన్‌‌ వార్న్‌‌ బ్యాగీ గ్రీన్‌‌ క్యాప్‌‌  భారీ ధరకు అమ్ముడుపోయింది. ఆసీస్‌‌లోని కామన్వెల్త్‌‌ బ్యాంక్‌‌ సీఈఓ మ్యాట్‌‌ కామైన్‌‌.. ఆక్షన్‌‌లో దీనిని రూ. 5 కోట్లకు  (1,007, 500 ఆస్ట్రేలియన్‌‌ డాలర్లు) కొనుగోలు చేశాడు. ఈ మొత్తాన్ని కార్చిచ్చు బాధితుల సాయం కోసం నేరుగా రెడ్‌‌క్రాస్‌‌కు బదిలీ చేయనున్నారు.

ఈ క్యాప్‌‌ను దేశంలోని పలు ప్రాంతాల్లో సందర్శనకు పెట్టి మరిన్ని విరాళాలు సేకరిస్తామని కామన్వెల్త్‌‌ బ్యాంక్‌‌ ప్రకటించింది. టూర్‌‌ అనంతరం సిడ్నీలోని బ్రాడ్‌‌మన్‌‌ మ్యూజియంలో ఈ క్యాప్‌‌ను ఉంచుతామని తెలిపింది. ఇక బుష్‌‌ఫైర్‌‌ బాధితులను ఆదుకునేందుకు ఫార్ముల్‌‌వన్‌‌ చాంపియన్‌‌ లూయిస్‌‌ హామిల్టన్‌‌ దాదాపు రూ.2.5 కోట్లను విరాళంగా ప్రకటించాడు.