Intel Layoffs: పాపం Intel ఉద్యోగులు.. వంద కాదు.. వెయ్యి కాదు.. 5 వేల మంది ఉద్యోగాలకు రోజులు దగ్గరపడ్డయ్..!

Intel Layoffs: పాపం Intel ఉద్యోగులు.. వంద కాదు.. వెయ్యి కాదు.. 5 వేల మంది ఉద్యోగాలకు రోజులు దగ్గరపడ్డయ్..!

Intel పేరు వినే ఉంటారు. ప్రముఖ సెమీకండక్టర్ కంపెనీ అయిన ఈ ఇంటెల్ 5 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ లేఆఫ్స్ ప్రభావంతో కాలిఫోర్నియా, ఒరెగాన్లో ఇంటెల్ సంస్థలో పనిచేస్తున్న ఎక్కువ మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఒక్క కాలిఫోర్నియాలోనే 2 వేల మందికి పైగా ఇంటెల్ ఉద్యోగులు లేఆఫ్ కారణంగా ఉద్యోగాలు కోల్పోనున్నారు. 

ఒరెగాన్లోని అలోహా, హిల్స్ బోరోలో మరో 2వేల 500 మంది ఉద్యోగులపై ఈ లేఆఫ్స్ ప్రభావం పడనుంది. ఇంటెల్ లేఆఫ్స్ కేవలం కాలిఫోర్నియా, ఒరెగాన్ వరకే పరిమితం కాలేదు. అరిజోనాలో కూడా తొలుత 170 మంది ఉద్యోగులను తొలగించాలని భావించిన ఇంటెల్ యాజమాన్యం ఈ సంఖ్యను ప్రస్తుతం 700కు పెంచింది.

ఇలా.. మొత్తంగా సుమారు 5 వేల మంది ఇంటెల్ ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు. అంతేకాదు.. టెక్సాస్ లో సీనియర్ లెవెల్ ఉద్యోగుల్లో కూడా కొందరి పోస్టులు ఊడిపోనున్నాయి. ఇజ్రాయెలీ ఫ్యాబ్రికేషన్ బిజినెస్కు కూడా మంగళం పాడాలని ఇంటెల్ నిర్ణయించింది. ఈ కారణంగా వందల మంది ఉపాధి కోల్పోనున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. కాస్ట్ కటింగ్ పేరు చెప్పి ఇంటెల్ సంస్థ ఉద్యోగాల ఊచకోతకు సిద్ధమైంది. ఇంటెల్ ప్రకటించిన ఈ తాజా లేఆఫ్స్తో కలిపి గత ఏడాది కాలంలో ఇంటెల్ 20 వేల మంది ఉద్యోగులను కొలువుల్లో నుంచి పీకేసి ఇంటికి పంపించేసింది.

వేలాది మందిని ఐటీ కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. ప్రాజెక్టులు లేవని, పనితీరు సరిగ్గా లేదని ఏవేవో సాకులు చెబుతూ సైలెంట్​లేఆఫ్స్ చేస్తున్నాయి. ప్రాజెక్టులు, స్కిల్స్ లేవని చెబుతూ రిజైన్ చేయాలని బెంచ్పై ఉన్న ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నాయి. వాళ్లతో ఎలాగోలా రిజైన్ చేయించి, ఇంటికి పంపించి వేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ లేఆఫ్స్​మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

Also Read:-ట్యాక్స్ హంటింగ్..!! ఏపీలోని బజ్జీలు, బోండాలు, టిఫిన్ షాపుల్లోని UPI పేమెంట్స్‌పై GST ఆరా

ఐటీ రంగాన్ని కుదిపేస్తున్న సైలెంట్ లేఆఫ్స్కు ముఖ్య కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అని​ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఐటీ రంగంలో ఏఐ వినియోగం పెరిగింది. మనుషులు చేయాల్సిన పనులు మొత్తం ఏఐ టూల్స్ చేస్తున్నాయి. దీంతో కంపెనీలు తమ ప్రొడక్షన్ కాస్ట్ను తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఉద్యోగులను తొలగిస్తే జీతాల భారం తగ్గుతుందని కంపెనీలు భావిస్తున్నాయి.