పీచు మిఠాయి అమ్మేటోళ్లతో జాగ్రత్త.. వీళ్లు అమ్మే చాక్లెట్లు పిల్లలు తింటే ఇక అంతే !

పీచు మిఠాయి అమ్మేటోళ్లతో జాగ్రత్త.. వీళ్లు అమ్మే చాక్లెట్లు పిల్లలు తింటే ఇక అంతే !

పీచు మిఠాయి అంటే పిల్లలు ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పిల్లలేంటి పెద్దలు కూడా ఈ స్వీట్ ను ఇష్టపడుతుంటారు. పింక్ రంగులో లేదా మరో ఆకర్షణీయమైన కలర్ లో ఉండే ఈ మిఠాయి కనిపిస్తే వదలకుండా కొని తినటం చూస్తుంటాం. అయితే పీచు మిఠాయి అమ్మే వాళ్లతో జాగ్రత్తగా ఉండకపోతే..  పిల్లలు చాలా డేంజంర్ జోన్ లో పడిపోయే ప్రమాదం ఉంది. 

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పీచుమిఠాయి అమ్మే వ్యక్తి దగ్గర గంజాయి చాక్లెట్లు కనిపించడం కలకలం రేపింది. ఒకవైపు మిఠాయి విక్రయిస్తూనే మరోవైపు రహస్యంగా.. గుట్టుచప్పుడు కాకుండా గంజాయి చాక్లెట్లు అమ్ముతుండటం చూసి స్థానికులు షాక్ కు గురయ్యారు. స్థానికుల సమాచారంతో ఆ వ్యక్తి  పీచు మిఠాయితోపాటు గంజాయి చాక్లెట్లను అమ్ముతున్నట్టలు నిర్ధారించారు పోలీసులు. 

గంజాయి చాక్లెట్లను అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చాక్లెట్లు ఎక్కడినుండి తీసుకువచ్చాడనే కోణంలో ఆరా తీస్తున్నారు. యూపీ కి చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు.. 
 పక్కా సమాచారంతో వ్యక్తిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పీచు మిఠాయి అమ్మే వ్యక్తి నుంచి గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. దీని వెనుక ఎవరున్నారు.. పెద్ద రాకెట్ ఏమైనా నడుస్తుందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.