హాస్పిటల్లో దారుణం: వచ్చారు, కాల్చారు, వెళ్లారు.. CCTVలో రికార్డ్..

 హాస్పిటల్లో దారుణం: వచ్చారు, కాల్చారు, వెళ్లారు.. CCTVలో రికార్డ్..

వీడియోలో చూస్తే దుండగులు మొదట చేతుల్లో తుపాకులతో  చందన్ మిశ్రా రూంలో వెళ్లడం కనిపిస్తుంది. చందన్  మిశ్రాను కాల్చిన తర్వాత  నిందితుడులు అక్కడి నుండి పారిపోతుంటారు. ఖైదీ చందన్ మిశ్రా బక్సర్ జిల్లా వాసి ఇంకా విచారణలో ఉన్న ఖైదీ.

ఒక కేసు విషయంలో చందన్ మిశ్రాని  భాగల్పూర్ జైలుకు తరలించారు. కొద్దిరోజుల క్రితం చందన్ మిశ్రా వైద్య సహాయం కోసం కొన్ని షరతులతో రిలీజై  పరాస్ ఆసుపత్రిలో చేరాడు, అయితే గుర్తు తెలియని దుండగులు ఆసుపత్రిలోకి చొరబడి అతనిపై కాల్పులు జరిపారని పాట్నా పోలీసులు తెలిపారు. 

చందన్ మిశ్రా  ఒక పెద్ద నేరస్థుడు, అతనిపై చాలా హత్య కేసులు ఉన్నాయి. కాల్పుల ఘటనలో  అతని శత్రువులు లేదా ప్రత్యర్థి ముఠా ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పులు జరిపిన దుండగుల  కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ విషయంపై పూర్తి దర్యాప్తు  చేపడుతున్నామన్నారు పోలీసులు. 

Also Read:-ఆ షాపింగ్ మాల్ మొత్తం తగలబడిపోయింది : 50 మంది కస్టమర్లు కాలిపోయారు

ఈ  ఘటనపై ప్రతిపక్షం రాష్ట్రంలోని అధికార పార్టీ జెడియు-బిజెపి ప్రభుత్వాన్ని నిలదీసింది. రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరైనా సురక్షితంగా ఉన్నారా అంటూ ఆర్జేడీ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ బీహార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

 

అలాగే ప్రభుత్వ నేరస్థులు ఉన్న ఐసియులోకి చొరబడి కాల్చి చంపారు. బీహార్‌లో ఎక్కడైనా ఎవరైనా సురక్షితంగా ఉన్నారా ? 2005కి ముందు ఇలా జరిగిందా? అంటూ తేజస్వి  యాదవ్ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

గత కొన్ని వారాలుగా బీహార్‌లో చాలరకాల నేర సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. గురువారం ఉదయం షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హతియాకాంత్ గ్రామంలో రాకేష్ సింగ్ 20 ఏళ్ల కుమారుడు శివం అలియాస్ బంటీ ఇంటి బయట రక్తంతో అతని మృతదేహం కనిపించింది. ఈ నెల ప్రారంభంలో ప్రముఖ వ్యాపారవేత్త, బిజెపి నాయకుడు గోపాల్ ఖేమ్కా కూడా పాట్నాలోని తన ఇంటి ముందే కాల్చి చంపారు.