షణ్ముక్ జస్వంత్ సోదరుడు లైంగిక దాడి చేశాడు : బాధితురాలు మౌనిక

షణ్ముక్ జస్వంత్ సోదరుడు లైంగిక దాడి చేశాడు : బాధితురాలు మౌనిక

షణ్ముఖ్ జస్వంత్, సంపత్ గంజాయి కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. బాధితురాలు మౌనిక ఫిర్యాదుతో సంచలన విషయాలు బయటపడ్డాయి. షణ్ముఖ్ సోదరుడు సంపత్ ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని బాధితురాలు మౌనిక పోలీసులను ఆశ్రయించింది. ఎంగేజ్మెంట్ పేరుతో రింగ్ తోడిగాడని సంపత్ పలు మార్లు హోటల్స్, రిసార్ట్ కు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడని చెప్పింది.

 షణ్ముఖ్ జస్వంత్ యూట్యూబ్ లో పలు వెబ్  సిరీస్ లలో అవకాశం ఇస్తానంటూ మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. సంపత్ కోసం వెళ్లిన నార్సింగ్ పోలీసులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ప్లాట్ లో 16 గ్రాముల గాంజాయితో షణ్ముఖ్ అతని సోదరుడు దొరికాడు. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండు వేర్వేరు కేసులను విచారణ చేస్తున్నారు.