శరద్ పవార్ పార్టీ కొత్త జెండా, గుర్తు విడుదల..

శరద్ పవార్ పార్టీ కొత్త జెండా, గుర్తు విడుదల..

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీ కొత్త జెండా, గుర్తును శుక్రవారం విడుదల చేశారు. ఎమ్మెల్యేలు జితేంద్ర అవద్, రోహిత్ పవార్ కొత్త జెండాతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జెండా పై ఓ వ్యక్తి ట్రంపెట్ ను ఊదడం కనిపిస్తుంది. పూర్వం రాజుల కాలం నుంచి ఇప్పుడు రాజకీయ నాయకుల వరకు ఎన్నికల ప్రచారంలో లేదా ఎదైన ముఖ్యమైన వ్యక్తుల ప్రవేశానికి గుర్తుగా ట్రంపెట్ ను ఊదుతారు.

 మరాఠీలో ట్రంపెట్ ను టుటారి అని పిలుస్తారు. శరద్ పవార్ స్థాపించిన ఎన్‌సీపీ పార్టీలో  అజిత్ పవార్ చీలిక తెచ్చారు. 2023 జూలైలో అజిత్ పవార్ మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఏకనాథ్ షిండే ప్రభుత్వంలో చేరారు. ప్రభుత్వంలో అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. దీంతో ఎన్నికల కమిషన్ అజిత్ పవార్ వర్గానిదే అసలైన పార్టీ అని పార్టీ పేరును, గడియారం గుర్తును కేటాయించింది.  

Also Read : డీల్ ఫిక్స్.. మ‌హారాష్ట్రలో 18 సీట్లల్లో కాంగ్రెస్ పోటీ!