స్టోరీ, క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో కొత్తదనం ఉంటేనే..సినిమాలు చేస్తా: శరత్ కుమార్

స్టోరీ, క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో కొత్తదనం ఉంటేనే..సినిమాలు చేస్తా: శరత్ కుమార్

తెలుగు, తమిళ భాషల్లో  వరుస ప్రాజెక్టులతో  బిజీగా ఉన్న సీనియర్ నటుడు  శరత్ కుమార్ ఇంపార్టెంట్ రోల్‌‌‌‌లో నటించిన లేటెస్ట్ మూవీ ‘డ్యూడ్’. ప్రదీప్ రంగనాథన్ హీరోగా కీర్తిశ్వరన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శరత్ కుమార్ తన పాత్ర గురించి చెప్పిన విశేషాలు. 

‘‘ ఇది చాలా కొత్త పాయింట్. ఒక ఫ్యామిలీలో ఇలాంటి  మేటర్ జరిగితే సొసైటీ ఎలా రియాక్ట్ అవుతుందనే కోణంలో డైరెక్టర్ చాలా బాగా  ప్రజెంట్ చేశారు. ఈ పాయింట్ కొత్తగా  ఉంటూనే ఆడియెన్స్‌‌‌‌కు కనెక్ట్ అవుతుంది.  ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్‌‌‌‌తోపాటు ఎమోషన్స్ చాలా కొత్తగా ఉంటాయి.  ఇందులో నేను  క్రూషియల్ క్యారెక్టర్ చేశా. కథలో, క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో  కొత్తదనం ఉంటేనే సినిమాలు చేయాలనుకుంటున్నా. అలాంటి పాత్ర ఇందులో చేశా.  ప్రదీప్‌‌‌‌కి మామ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తా.   

హ్యుమర్, ఎమోషన్ లాంటివన్నీ డిఫరెంట్‌‌‌‌గా ఉంటాయి. పెర్ఫార్మెన్స్ చేయడం కూడా టఫ్. డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఈ క్యారెక్టర్ చేయడం చాలా ఎక్సయిటింగ్‌‌‌‌గా అనిపించింది.  ప్రదీప్ రంగనాథన్  ఆల్ రౌండర్. మంచి డైరెక్టర్, గుడ్ పెర్ఫార్మర్. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టయిల్ ఉంది. ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ హై ఎనర్జీతో ఉంటుంది.  సాయి అభ్యంకర్ మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్ ఎసెట్. మైత్రీ మూవీ మేకర్స్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్.  

సినిమాకి కావాల్సిన ప్రతిది ఎక్కడ రాజీపడకుండా సమకూర్చూరు.  ఇక నాకు ఎప్పట్నుంచో సుభాస్ చంద్రబోస్ బయోపిక్ చేయాలని డ్రీమ్ ఉంది.  ఆ అవకాశం రావాలని కోరుకుంటున్నా. ప్రస్తుతం ఐదారు తెలుగు, తమిళ సినిమాలతోపాటు ఒక హిందీ మూవీ చేస్తున్నా’’.