ఇంగ్లండ్‌‌‌‌ టూర్ లో ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ టాలెంట్‌‌‌‌ చూపెట్టిన శార్దూల్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌

ఇంగ్లండ్‌‌‌‌ టూర్ లో ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ టాలెంట్‌‌‌‌ చూపెట్టిన శార్దూల్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌
  • 7 వికెట్లతో శార్దూల్‌ ఠాకూర్​ విజృంభణ
  • సౌతాఫ్రికా ఫస్ట్‌ ఇన్నింగ్స్‌  229 ఆలౌట్‌
  • ఇండియా సెకండ్‌ ఇన్నింగ్స్‌ 85/2

జొహన్నెస్‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్‌‌‌‌: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌‌‌‌ టూర్లలో తన ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ టాలెంట్‌‌‌‌ చూపెట్టిన శార్దూల్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌ (7/61) సౌతాఫ్రికా గడ్డపై తనలోని పవర్‌‌‌‌ఫుల్‌‌‌‌ పేసర్‌‌‌‌ను నిద్రలేపాడు. బుల్లెట్స్‌‌‌‌ లాంటి బాల్స్‌‌‌‌తో సఫారీ బ్యాటర్ల పని పట్టాడు. సెకండ్‌‌‌‌ టెస్టులో రెండో రోజు, మంగళవారం స్టార్‌‌‌‌ పేసర్లు షమీ(2/52), బుమ్రా (1/49)పెద్దగా రాణించని వేళ.. మంచి స్కోరు దిశగా దూసుకెళ్తున్న సౌతాఫ్రికాను దెబ్బ కొట్టాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి సఫారీ గడ్డపై బెస్ట్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ ఫిగర్స్‌‌‌‌ సాధించిన ఇండియన్​గా రికార్డుకెక్కాడు. శార్దూల్‌‌‌‌ దెబ్బకు ఫస్ట్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌లో సౌతాఫ్రికా 79.4 ఓవర్లలో 229 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. 27 రన్స్‌‌‌‌ లీడ్‌‌‌‌ మాత్రమే సాధించింది. కీగన్‌‌‌‌ పీటర్సన్‌‌‌‌ (62), బవూమ (51) చెరో ఫిఫ్టీతో రాణించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌‌‌‌కు వచ్చిన ఇండియా సెకండ్‌‌‌‌ డే చివరకు 20 ఓవర్లలో 85/2 స్కోరుతో నిలిచింది. జాన్సెన్‌‌‌‌ (1/18) బౌలింగ్‌‌‌‌లో స్టాండిన్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ లోకేశ్‌‌‌‌ రాహుల్ (8),  క్రీజులో కుదురుకున్న తర్వాత మయాంక్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌ (23).. ఒలివర్‌‌‌‌ (1/22) బౌలింగ్‌‌‌‌లో ఔటైనా.. సీనియర్‌‌‌‌ బ్యాటర్లు   పుజారా (35 బ్యాటింగ్‌‌‌‌), రహానె (11బ్యాటింగ్‌‌‌‌) నిలబడ్డారు. ప్రస్తుతం టీమిండియా 58 రన్స్‌‌‌‌ లీడ్‌‌‌‌లో ఉంది. ఇప్పటికైతే రెండు టీమ్స్‌‌‌‌ ఈక్వల్‌‌‌‌గా కనిపిస్తున్నాయి.  మూడో రోజు మంచిగ బ్యాటింగ్‌‌‌‌ చేసి కనీసం 300 టార్గెట్‌‌‌‌ ఇస్తే ఇండియాకు గెలిచే అవకాశం ఉంటుంది. 

శార్దూల్‌‌‌‌ సూపర్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌
సెకండ్‌‌‌‌ డే ఆటలో శార్దూల్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌ బౌలింగే హైలైట్‌‌‌‌. సిరాజ్‌‌‌‌ తొడ కండరాల నొప్పితో ఇబ్బంది పడుతుండటంతో శార్దూల్‌‌‌‌కు ఎక్కువ ఓవర్లు బౌలింగ్‌‌‌‌ చేసే చాన్స్‌‌‌‌ వచ్చింది. దీన్ని తను యూజ్‌‌‌‌ చేసుకోవడమే కాకుండా.. ఇండియా బౌలింగ్‌‌‌‌ ఎటాక్‌‌‌‌ను ముందుండి నడిపించాడు. వరుసగా వికెట్లు తీస్తూ హోమ్‌‌‌‌టీమ్‌‌‌‌పై ప్రెజర్‌‌‌‌ పెంచాడు. మార్నింగ్‌‌‌‌ సెషన్‌‌‌‌లో ఔట్ స్వింగర్స్‌‌‌‌తో సఫారీలను ఇబ్బంది పెట్టిన తను లంచ్‌‌‌‌ తర్వాత ఆఫ్‌‌‌‌–కట్టర్లతో దెబ్బకొట్టాడు. ముఖ్యంగా ఫస్ట్‌‌‌‌ సెషన్‌‌‌‌లో తను సూపర్‌‌‌‌ స్పెల్‌‌‌‌ వేశాడు. ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరు 35/1తో ఆట కొనసాగించిన సౌతాఫ్రికా బ్యాటర్లు ఎల్గర్‌‌‌‌ (28), పీటర్సన్‌‌‌‌ మార్నింగ్‌‌‌‌ సెషన్‌‌‌‌లో జోరు  చూపెట్టారు. దీంతో  స్టాండిన్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ రాహుల్‌‌‌‌  డ్రింక్స్‌‌‌‌ తర్వాత ఠాకూర్‌‌‌‌ను బౌలింగ్‌‌‌‌కు దింపాడు. కెప్టెన్‌‌‌‌ నమ్మకాన్ని నిలబెట్టిన తను.. ఫస్ట్‌‌‌‌ ఎల్గర్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేశాడు. ఆ తర్వాత వరుస ఓవర్లలో కీగన్‌‌‌‌, డుసెన్‌‌‌‌ (1)ను వెనక్కుపంపి ఇండియాను రేసులోకి తెచ్చాడు. దాంతో, 88/1తో ఉన్న హోమ్‌‌‌‌టీమ్‌‌‌‌ లంచ్‌‌‌‌ టైమ్‌‌‌‌కు 102/4తో డీలా పడ్డది. బ్రేక్‌‌‌‌ తర్వాత వెరైన్‌‌‌‌ (21)తో కలిసి బవూమ ఇన్నింగ్స్‌‌‌‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌‌‌‌కు 60 రన్స్‌‌‌‌ జోడించడంతో 162/4తో సఫారీలు మంచి స్కోరు చేసేలా కనిపించారు. కానీ, మళ్లీ బౌలింగ్‌‌‌‌కు వచ్చిన శార్దూల్‌‌‌‌.. నాలుగు బాల్స్‌‌‌‌ తేడాతో ఈ ఇద్దరినీ పెవిలియన్‌‌‌‌ చేర్చి కెరీర్‌‌‌‌లో ఫస్ట్‌‌‌‌ టైమ్ ఫైవ్‌‌‌‌–వికెట్‌‌‌‌హాల్‌‌‌‌ ఖాతాలో వేసుకున్నాడు. ఆ వెంటనే రబాడ (0) షమీ ఔట్ చేయడంతో సౌతాఫ్రికా ఏడో వికెట్‌‌‌‌ కోల్పోయింది. టీ బ్రేక్‌‌‌‌ తర్వాత  స్పీడ్‌‌‌‌గా ఆడిన కేశవ్‌‌‌‌ మహారాజ్ (21), జాన్సెన్‌‌‌‌ (21) సౌతాఫ్రికాను లీడింగ్‌‌‌‌లోకి తీసుకెళ్లారు. బుమ్రా బౌలింగ్‌‌‌‌లో మహారాజ్‌‌‌‌ బౌల్డ్​ అవగా.. కొద్దిసేపటికే జాన్సన్‌‌‌‌, ఎంగిడి (0)ని పెవిలియన్‌‌‌‌ చేర్చిన ఠాకూర్‌‌‌‌ సఫారీ ఇన్నింగ్స్‌‌‌‌ను ముగించాడు. 

స్కోర్లు
ఇండియా ఫస్ట్‌ ఇన్నింగ్స్‌: 202 ఆలౌట్‌; 
సౌతాఫ్రికా ఫస్ట్‌ ఇన్నింగ్స్‌: 79.4 ఓవర్లలో 229 ఆలౌట్‌ ( పీటర్సన్‌ 62, బవూమ 51, శార్దూల్‌ 7/61,  షమీ 2/52); ఇండియాసెకండ్‌ ఇన్నింగ్స్‌: 20 ఓవర్లలో 85/2 (పుజారా 35 బ్యాటింగ్‌, రహానె 11 బ్యాటింగ్‌, జాన్సెన్‌ 1/18).