టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కు బిగ్ షాక్ తగిలింది. దేశవాళీ టీ20 టోర్నీసయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీకి ముంబై కెప్టెన్ గా సూర్యకు స్క్వాడ్ లో ఛాన్స్ ఇచ్చినా కెప్టెన్ గా ఎంపిక చేయలేదు. నవంబర్ 26 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీకి శనివారం (నవంబర్ 22) 17 మంది సభ్యులతో కూడిన ముంబై స్క్వాడ్ ను ప్రకటించారు. ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ కు కెప్టెన్సీ అప్పగించింది. ఇటీవలే రంజీ ట్రోఫీలో ముంబై కెప్టెన్ గా వ్యవహరించిన ఠాకూర్.. రానున్న ముస్తాఖ్ అలీ ట్రోఫీలోనూ ముంబై జట్టును
నడిపించనున్నాడు.
ప్లేయర్ గానే సూర్యను సెలక్ట్ చేయడానికి కారణం లేకపోలేదు. డిసెంబర్ లో సౌతాఫ్రికాతో ఇండియా ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇండియాను సూర్య కెప్టెన్ కావడంతో సయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీలో కొన్ని మ్యాటిక్ లకు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఈ కారణంగానే సూర్యను కేవలం ప్లేయర్ గానే సెలక్ట్ చేశారు. ఈ టోర్నీలో ముంబై తమ లీగ్ మ్యాచ్‌లను లక్నోలో అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో ఆడనుంది. శార్దూల్ ఠాకూర్ కెప్టెన్సీలోని ముంబై జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌లగా బరిలోకి దిగుతోంది. నవంబర్ 26న లక్నోలో జరిగే టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌లో ముంబై జట్టు రైల్వేస్‌తో తలపడుతుంది.
2024–25 సీజన్ లో టైటిల్ గెలిచిన ముంబై జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. శివమ్ దుబే, అజింక్య రహానే , సర్ఫరాజ్ ఖాన్, ఆయుష్ మాత్రేలతో కూడిన బ్యాటింగ్ లైనప్ దుర్బేధ్యంగా కనిపిస్తుంది. ఈ జట్టులో హార్దిక్ తమోర్ తో పాటు వికెట్ కీపర్ గా అంగ్క్రిష్ రఘువంశీ తుషార్ దేశ్ పాండే, తనుష్ కోటియన్ సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సీజన్ రంజీ ట్రోఫీలో ఐదు మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీతో 530 పరుగులు చేసిన సిద్ధేష్ లాడ్ కూడా స్క్వాడ్ లో ఉండడం ముంబై బలాన్ని మరింత పెంచుతుంది. ఎలైట్ డివిజన్ నవంబర్ 26 నుండి డిసెంబర్ 18 వరకు జరుగుతుంది. టోర్నీ మొదటి రౌండ్ లక్నో, హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్‌కతాలో జరుగుతుంది. నాకౌట్ మ్యాచ్ లు ఇండోర్‌లో జరగనున్నాయి.
ముస్తాఖ్ అలీ ట్రోఫీ ముంబై జట్టు:
శార్దూల్ ఠాకూర్ (కెప్టెన్), హార్దిక్ తమోర్ (వికెట్ కీపర్), అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), అజింక్యా రహానే, ఆయుష్ మ్హత్రే, సూర్యకుమార్ యాదవ్, సర్ఫరాజ్ ఖాన్, సిద్ధేష్ లాడ్, శివమ్ దూబే, సాయిరాజ్ పటేల్, ముషీర్ ఖాన్, సూర్యన్స్ షెగ్దే, అథర్వ అంకోల్కేర్,తనిష్ కొటియన్, షామ్స్ ములని, తుషార్ దేశ్ పాండే, ఇర్ఫాన్ ఉమైర్
