సన్స్ ఐపీఓ! టాటా షేర్లు జూమ్‌‌‌‌‌‌‌‌

సన్స్ ఐపీఓ! టాటా షేర్లు జూమ్‌‌‌‌‌‌‌‌
  • 14 శాతం వరకు ర్యాలీ
  • వచ్చే ఏడాది సెప్టెంబర్ లోపు ఐపీఓ 
  • రూ.8 లక్షల కోట్ల వాల్యుయేషన్‌‌‌‌‌‌‌‌ ఉండే అవకాశం!

న్యూఢిల్లీ : టాటా గ్రూప్ షేర్లు ఇన్వెస్టర్లకు  భారీ లాభాలిస్తున్నాయి. టాటా మోటార్స్‌‌‌‌‌‌‌‌, టాటా కెమికల్స్‌‌‌‌‌‌‌‌, రాలిస్‌‌‌‌‌‌‌‌ ఇండియా, టాటా పవర్, నెల్కో, టాటా ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ కార్పొరేషన్ షేర్లు  గురువారం 14 శాతం వరకు  ర్యాలీ చేశాయి. టాటా గ్రూప్ కంపెనీల పేరెంట్ కంపెనీ టాటా సన్స్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కి వస్తుందని రిపోర్ట్స్ వెలువడ్డాయి. దీంతో ఈ గ్రూప్ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు. టాటా సన్స్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో లిస్ట్ అయితే గ్రూప్ వాల్యుయేషన్ మరింత పెరుగుతుందని,  అంతేకాకుండా షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హోల్డింగ్ స్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సులభంగా మారుతుందని ఎనలిస్టులు భావిస్తున్నారు.  

గ్రూప్ కంపెనీలు పేరెంట్ కంపెనీలోని తమ వాటాలను అమ్మడానికి  వీలుంటుందని పేర్కొన్నారు. కాగా,  ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ హోల్డింగ్‌‌‌‌‌‌‌‌ కంపెనీ,  టాటా కంపెనీల  ప్రమోటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన  టాటా సన్స్‌‌‌‌‌‌‌‌ను  ‘అప్పర్ లేయర్’  ఎన్‌‌‌‌‌‌‌‌బీఎఫ్‌‌‌‌‌‌‌‌సీగా 2‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌022 సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ వర్గీకరించింది.  రూల్స్ ప్రకారం, ఈ  క్లాసిఫికేషన్ జరిగిన మూడేళ్ల లోపు  ఈ కంపెనీ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో లిస్ట్ కావాల్సి ఉంటుంది. అంటే వచ్చే ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోపు టాటా సన్స్ ఐపీఓ ఇన్వెస్టర్ల ముందుకు రావాలి. 

టాటా ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ 380 శాతం రిటర్న్‌‌‌‌‌‌‌‌..

టాటా గ్రూప్ కంపెనీల షేర్లు గురువారం భారీగా పెరిగాయి. టాటా పవర్ 8 శాతానికి పైగా లాభపడింది. టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌  4 శాతం పెరగగా, టాటా మోటార్స్ రెండు శాతం లాభపడింది. టాటా కెమికల్స్ ఏకంగా 14 శాతం  ర్యాలీ చేసింది. టాటా ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ కార్పొరేషన్  షేర్లు 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ టచ్ చేశాయి. ఈ కంపెనీ షేర్లు గత నెల రోజుల్లోనే 74 శాతం రిటర్న్ ఇచ్చాయి. గత ఏడాది కాలంలో 380 శాతం పెరిగాయి. టాటా ఎలెక్సీ, టాటా స్టీల్‌‌‌‌‌‌‌‌, ట్రెంట్,  వోల్టాస్‌‌‌‌‌‌‌‌, టీసీఎస్ షేర్లు  1 – 4 శాతం  వరకు  లాభపడ్డాయి. 

అతిపెద్ద ఐపీఓ

టాటా సన్స్‌‌‌‌‌‌‌‌ ఏకంగా 96 బిలియన్ డాలర్ల (రూ.8 లక్షల కోట్ల) వాల్యుయేషన్ దగ్గర ఫండ్స్ సేకరించనుందని ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ బ్యాంకింగ్ కంపెనీ స్పార్క్‌‌‌‌‌‌‌‌ పీడబ్ల్యూఎం ప్రైవేట్ అంచనా వేస్తోంది. ఈ వాల్యుయేషన్ దగ్గర 5 శాతం వాటాను అమ్మినా ఐపీఓ సైజ్  4.8 బిలియన్ డాలర్లు అవుతుంది.  అతిపెద్దదైన ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ ఐపీఓ (2.8 బిలియన్ డాలర్లు)  కంటే ఇది సుమారు రెండింతలు పెద్దది కానుంది.  టాటా గ్రూప్   సెమీకండక్టర్స్‌‌‌‌‌‌‌‌, ఈవీ బ్యాటరీస్ వంటి కొత్త తరం సెగ్మెంట్లలోకి  కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 

పెరగనున్న టాటా కమర్షియల్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌ ధరలు

టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ ధరలను 2 శాతం మేర పెంచింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి రేట్ల పెంపు  అమల్లోకి వస్తుంది. ముడిసరుకుల ధరలు పెరగడంతో రేట్లు పెంచుతున్నామని కంపెనీ  ప్రకటించింది. టాటా మోటార్స్‌‌‌‌‌‌‌‌కు చెందిన అన్ని కమర్షియల్ వెహికల్ రేట్లు  వచ్చే నెల నుంచి పెరుగుతాయి.