షర్మిల కాన్వాయ్ ను అడ్డుకోలేదు.. విజయవాడ సీపీ క్రాంతి రాణా

షర్మిల కాన్వాయ్ ను అడ్డుకోలేదు.. విజయవాడ సీపీ  క్రాంతి రాణా

ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఇవాళ ( జనవరి 21) బాధ్యతలు స్వీకరించారు.  కడప నుంచి గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న షర్మిల భారీ కాన్వాయ్ తో ఏపీ కాంగ్రెస్ కార్యాలయానికి బయలుదేరగా, ఎనికేపాటు వద్ద కాన్వాయ్ పోలీసులు అడ్డుకున్నారు.అక్కడి నుంచి వేరే మార్గంలో వెళ్లాలని వాహనాలను మళ్లించారు. 

పోలీసులు ఏమన్నారంటే?

వైఎస్ షర్మిల కాన్వాయ్ ను అడ్డుకోవడంపై విజయవాడ సీపీ క్రాంతి రాణా స్పందించారు. కాన్వాయ్ ను అడ్డుకోలేదని, వెనుక వచ్చే వాహనాలను మాత్రమే దారిమళ్లించామన్నారు. ర్యాలీగా ముందు వచ్చిన బైక్స్ , షర్మిల వాహనాలను పంపించామన్నారు. కానీ వెనుకు వస్తున్న మరికొన్ని కార్లను వేరే మార్గంలో వెళ్లాలని సూచించామన్నారు. విజయవాడలో ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా  కాన్వాయ్ తో పాటు కొన్ని వాహనాలను పంపిన తరువాతే మరికొన్ని వాహనాలను పంపించామని విజయవాడ సీపీ క్రాంతి రాణా తెలిపారు. 

 వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు  నినాదాలు చేశారు. అన్ని అనుమతులు తీసుకుని వెళ్తుంటే అడ్డుకోవడం ఏంటిని కాంగ్రెస్ శ్రేణులు పోలీసులను ప్రశ్నించారు. వాహనాలను దారిమళ్లించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించారు. అన్ని వాహనాలను అనుమతిస్తేనే అక్కడి నుంచి వెళ్తానని చెప్పడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనతో దిగివచ్చిన పోలీసులు... షర్మిల కాన్వాయ్ కు అనుమతి ఇచ్చారు.