అదిరింది: ఆదివాసీలతో షర్మిల డ్యాన్స్​

 అదిరింది: ఆదివాసీలతో  షర్మిల డ్యాన్స్​

అల్లూరి జిల్లా చింతపల్లిలో షర్మిల సభ జరిగింది.  సభా స్థలానికి చేరుకున్న ఆమెకు థింసా నృత్యంతో గిరిజనులు స్వాగతం పలికారు. గిరిజనులతో కలిసి షర్మిల కాసేపు నృత్యం చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చాక 25 వేల పోస్టులతో డీఎస్సీ అన్నారు.. ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం డీఎస్సీ విషయమే మరిచిపోయారంటూ ఎద్దేవా చేశారు.

గిరిజనులు పగలంతా కాయకష్టం చేసి సాయంత్రం గూడెంలో సేదతీరే సమయంలో ప్రతి నిత్యం ఆడిపాడే నృత్యంగా మొదలైన థింసా.. తదనంతర కాలంలో ప్రేక్షకులను ఉర్రూతలూగించే ప్రత్యేక నృత్యంగా గుర్తింపు పొందింది. దేశ, విదేశీ ప్రముఖలు రాష్ట్రానికి, జిల్లాకు విచ్చేసిన సందర్భాల్లో గిరిజన కళాకారులతో ఈ థింసా నృత్యంతో వచ్చిన అతిథులకు స్వాగతం పలకడం  ఆనవాయితీగా మారింది. ఇప్పుడు కూడా చింతపల్లిలో ఆదివాసీలు షర్మిలకు థింసా డ్యాన్స్​ తో స్వాగతం పలికినప్పుడు గిరిజనులతో కలిసి కాసేపు సందడి చేశారు. టే మహిళలంతా జట్టు కట్టి చేసే ఆనంద నృత్యమే థింసా. పురుషులు గిరిజన సంప్రదాయ డప్పు, సన్నాయి, కొమ్ముబూరలు వంటి వాయిద్యాలను మ్రోగిస్తూ ఉంటే కనీసంగా 10 నుంచి 22 మంది మహిళలు పాట పాడుతూ వలయాకారంలో నృత్యం చేస్తుంటారు.

ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల మంచి దూకుడు మీద ఉన్నారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జిల్లాల పర్యటనలతో బిజీగా ఉన్నారు షర్మిల. తాజాగా రాజన్న రచ్చబండ, బహిరంగ సభలతో హస్తం పార్టీ శ్రేణుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచే పనిలో పడ్డారు. లో గతంలో పోటీకి మొగ్గుచూపని నేతలు సైతం ఇప్పుడు హస్తం గుర్తు మీద పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారు .  అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లిలో వైఎస్ షర్మిల బహిరంగ సభ నిర్వహించారు.