అక్టోబర్ 20 నుంచి షర్మిల ‘ప్రజా ప్రస్థానం’

V6 Velugu Posted on Oct 17, 2021

  • 20 నుంచి షర్మిల పాదయాత్ర
  • ప్రజా ప్రస్థానం పేరుతో చేవెళ్ల నుంచి స్టార్ట్
  • రోజూ 15 కిలోమీటర్లు సాగేలా ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: వైఎస్సార్​టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఈ నెల 20 నుంచి ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర ప్రారంభించనున్నారు. తన తండ్రి, మాజీ సీఎం వైఎస్సార్​ సెంటిమెంట్ గా భావించే చేవెళ్ల నుంచి యాత్ర స్టార్ట్ చేయనున్నారు. రోజూ 10 నుంచి 15 కిలోమీటర్లు పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ ఖరారు చేస్తున్నామని పార్టీ కీలక నేత, చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ కొండా రాఘవరెడ్డి తెలిపారు. ఎక్కువగా గ్రామాల మీద నుంచే యాత్ర సాగుతుందన్నారు. రాష్ర్టంలో ప్రతి ఇంట్లో వైఎస్సార్​ పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్లున్నారని చెప్పారు.  ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వారం రోజులు, ఆ తరువాత ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి యాత్ర సాగుతుందని తెలిపారు. తొలి రోజు చేవెళ్లలో సుమారు లక్ష మంది పాల్గొనేలా అన్ని జిల్లాల నుంచి జన సమీకరణ చేస్తున్నట్లు వెల్లడించారు. నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల మీదుగా ఉత్తర తెలంగాణ నుంచి యాత్ర కొనసాగనున్నట్టు తెలుస్తోంది. చేవెళ్ల నుంచి వైఎస్సార్​ పాదయాత్ర ప్రారంభించి ఉమ్మడి ఏపీలో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు షర్మిల కూడా అదే సెంటిమెంట్​ కొనసాగించబోతున్నారు.  

యాత్రపై పీకే టీంతో చర్చలు
పాదయాత్రకు సంబంధించి స్పీచ్, యాత్రలో ఏయే అంశాలు ప్రస్తావించాలనే విషయాలపై షర్మిలతో ప్రశాంత్ కిషోర్ టీమ్ పలుమార్లు సమావేశమై చర్చించింది. షర్మిల పార్టీ ఏర్పాటు ప్రకటన నాటి నుంచి ఆమెకు సలహాదారుగా పీకే టీం పనిచేస్తోంది. తమిళనాడు డీఎంకే ఎమ్మెల్యే కూతురు ప్రియ.. పీకే టీంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ఫిభ్రవరిలో పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన నాటి నుంచి షర్మిల సీఎం కేసీఆర్‌‌‌‌, కేటీఆర్, రాష్ర్ట ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, పబ్లిక్ సమస్యలను ప్రస్తావిస్తూ రోజూ వార్తల్లో ఉంటున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్షలు చేపడుతున్నారు. వర్సిటీల దగ్గర దీక్ష చేస్తున్నారు.

యాత్ర విజయవంతం కావాలంటూ.. 
షర్మిల పాదయాత్ర సక్సెస్‌ కావాలని చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్, పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, పార్టీ ఆఫీస్  నుంచి చిలుకూరు బాలాజీ దేవాలయం వరకు ఆదివారం పాదయాత్ర చేయనున్నారు.

Tagged Telangana, YS Sharmila, YS Rajashekar Reddy, Chevella, YSRTP, Sharmila Padayatra, sharmila Praja Prasthanam

Latest Videos

Subscribe Now

More News