Sharwa36: శర్వానంద్ కొత్త సినిమా టైటిల్ రివీల్.. రేసర్‌గా స్టైలిష్ లుక్‌లో అదిరిపోయాడుగా

Sharwa36: శర్వానంద్ కొత్త సినిమా టైటిల్ రివీల్.. రేసర్‌గా స్టైలిష్ లుక్‌లో అదిరిపోయాడుగా

టాలీవుడ్‌లో టాలెంటెడ్ యాక్టర్స్లో శర్వానంద్ ఒకరు. ఆడియన్స్ను ఎంటర్టైన్ చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. ఈ క్రమంలో వరుసబెట్టి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఇవాళ (అక్టోబర్ 20న) దీపావళి సందర్భంగా కొత్త సినిమా (Sharwa36) అప్డేట్ ఇస్తూ ఫ్యాన్స్ని ఖుషి చేశాడు. ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటుగా టైటిల్ ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.  

అభిలాష్ రెడ్డి-శర్వానంద్:

లూజర్ వెబ్ సీరీస్తో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అభిలాష్ రెడ్డి, హీరో శర్వానంద్తో కొత్త ప్రయోగం చేయనున్నారు. స్పోర్ట్స్ బేస్డ్ కథతో వస్తున్నాడు. గూస్‌బంప్స్‌ తెప్పించే అడ్వెంచరస్‌ రైడ్‌కు సిద్దంగా ఉండండి అని ప్రమోషన్స్లో చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో లేటెస్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో భారీ అంచనాలు క్రియేట్ చేశాడు.

ఇందులో బైక్ రైడర్గా శర్వా కనిపించబోతున్నారు. రోల్కి తగ్గట్టుగానే శర్వా తన కొత్త మూవీకి ‘బైకర్’ అని టైటిల్ ప్రకటించారు. ‘‘జీవితంలో ప్రతి మూలను, ప్రతి జంప్‌ను, ప్రతి అడ్డంకిని జయించి కీర్తిని లక్ష్యంగా చేసుకోండి. మీకు దీపావళి శుభాకాంక్షలు’’ అని మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు.

యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో మాళవిక నాయర్ హీరోయిన్ నటిస్తుంది. సీనియర్ హీరో రాజశేఖ‌ర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. శ‌ర్వానంద్ తండ్రి పాత్ర‌లో న‌టిస్తున్నట్లు తెలుస్తోంది. బ్ర‌హ్మాజి, అతుల్ కుల‌క‌ర్ణి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.

శర్వానంద్ సినిమాలు:

మరోవైపు, శర్వానంద్ సంపత్ నంది దర్శకత్వంలో ‘భోగి’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శర్వానంద్ హీరోగా నటిస్తున్న 38వ చిత్రమిది. ఇదొక రూరల్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో సాగే పీరియాడికల్ యాక్షన్ డ్రామా. 1960 తెలంగాణ- సరిహద్దులో జరిగిన ఓ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందింస్తున్నారు. ఈ మూవీలో శర్వానంద్‌  సరసన అనుపమ పరమేశ్వరన్‌, డింపుల్ హయతి నటించనున్నారు.

అలాగే, సామజవరగమన వంటి బ్యూటిఫుల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందించిన రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ‘నారీ నారీ నడుమ మురారి’ చేస్తున్నారు. సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్స్‌‌. ఈ మూవీని బడా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.