సంక్రాంతి రేసులో శర్వానంద్ నారి నారి నడుమ మురారి మూవీ..!

సంక్రాంతి రేసులో శర్వానంద్ నారి నారి నడుమ మురారి మూవీ..!

శతమానం భవతి, ఎక్స్‌‌ప్రెస్ రాజా లాంటి చిత్రాలతో సంక్రాంతికి వచ్చి బ్లాక్‌‌ బస్టర్స్‌‌ అందుకున్న శర్వానంద్‌‌... మరోసారి ఇదే సీజన్‌‌లో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. శర్వానంద్‌‌ హీరోగా ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు తెరకెక్కిస్తున్న ‘నారి నారి నడుమ మురారి’ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు శుక్రవారం ప్రకటించారు.  పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌ కావడంతో సంక్రాంతి విడుదల సరైన సమయంగా భావిస్తున్నామని నిర్మాతలు తెలియజేశారు. 

సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్స్‌‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ సహకారంతో ఎకె ఎంటర్‌‌‌‌టైన్మెంట్స్ బ్యానర్‌‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. జ్ఞాన శేఖర్ విఎస్,  యువరాజ్ సినిమాటో గ్రాఫర్స్‌‌గా వర్క్ చేస్తున్న ఈ చిత్రానికి విశాల్‌‌ చంద్రశేఖర్‌‌‌‌ సంగీతం అందిస్తున్నాడు.