కోహ్లీ తిరిగి రండి.. జట్టుకి ఇప్పుడు మీరు అవసరం: ఎంపీ శశిథరూర్

కోహ్లీ తిరిగి రండి.. జట్టుకి ఇప్పుడు మీరు అవసరం: ఎంపీ శశిథరూర్

న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్‎కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‎తో ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు రెడ్ బాల్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు రన్ మెషిన్. కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి నెలలు గడుస్తున్నా.. అతడి నిష్ర్కమణపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఇంగ్లాండ్ పర్యటనకు యువ రక్తంతో యంగ్ టీమిండియా అంచనాల మేర రాణించకలేకపోవడంతో కోహ్లీ తన రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని మళ్లీ టీమిండియా టెస్టు పగ్గాలు చేపట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

 ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‎పై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కోహ్లీ భారత క్రికెట్‎కు ఇప్పుడు నువ్వు కావాలి. దయచేసి తిరిగి రండి’ అని కోరారు శశిథరూర్. ఈ విషయంలో బీసీసీఐ, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పునరాలోచించాలని సూచించారు.

ALSO READ | IND vs ENG 2025 : ఆ 4 వికెట్లు విజయం ఇండియాదే.. క్రిస్ వోక్స్ బ్యాటింగ్‌పై ట్విస్ట్..?

ఇంగ్లాండ్ పర్యటనకు కొన్ని వారాల ముందు విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆర్సీబీని విజేతగా నిలపడంలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ఆ జట్టు తరుఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‎గా నిలిచాడు. గతంలో టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ఇచ్చిన కోహ్లీ.. ప్రస్తుతమున్న ఫిట్ నెస్, ఫామ్ ప్రకారం చూసుకుంటే అతడు మరో రెండు మూడేళ్లు టెస్ట్ క్రికెట్ ఆడుతాడులే అని అనుకున్నారంతా. కానీ కోహ్లీ అందరికి షాకిస్తూ ఇంగ్లాండ్ పర్యటనకు ముందు రెడ్ బాల్ ఫార్మాట్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. 

అయితే, కోహ్లీ రిటైర్మెంట్ వెనక పెద్ద కథే నడిచిందని ప్రచారం. టెస్టు ఫార్మాట్‎కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇంగ్లాండ్ పర్యటనకు తనకు జట్టు పగ్గాలు అప్పగించాలని కోహ్లీ బీసీసీఐని కోరాడట. కానీ బీసీసీఐ, హెడ్ కోచ్ గంభీర్ అందుకు ఒప్పుకోలేదట. యంగ్ ప్లేయర్ కు టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ అప్పగించి.. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాలని డిసైడ్ అయ్యారట. 

దీంతో అసంతృప్తికి గురైన కోహ్లీ ఏకంగా టెస్ట్ క్రికెట్‎కే రిటైర్మెంట్ ప్రకటించాడు. కోహ్లీ నిర్ణయంతో అతడి అభిమానులతో పాటు క్రికెట్ ప్రియులు, క్రీడా విశ్లేషకులు, మాజీలు షాక్ అయ్యారు. మరో మూడు నాలుగేళ్లు ఆడేంత ఫిట్ నెస్ ఉన్నప్పటికీ కోహ్లీ అనూహ్యంగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడని ఆశ్యర్యానికి గురయ్యారు. 

బీసీసీఐ ఇంటర్నల్ పాలిటిక్స్ వల్లే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడని విమర్శించారు. ఈ సమయంలోనే కోహ్లీ రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని మళ్లీ రెడ్ బాల్ క్రికెట్ ఆడాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఎంపీ శశిథరూర్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేయడంతో మరోసారి కోహ్లీ రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి.