'సూపర్ హీరోస్ ఇన్ కేరళ' పోస్ట్ పై శశి థరూర్ ఇంట్రస్టింగ్ కామెంట్

'సూపర్ హీరోస్ ఇన్ కేరళ' పోస్ట్ పై శశి థరూర్ ఇంట్రస్టింగ్ కామెంట్

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ .. తాజాగా చేసిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. దాదాపు 8.4 మిలియన్ల ట్విట్టర్ ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఆయన... సూపర్ హీరోస్ ఇన్ కేరళ అనే క్యాప్షన్ తో అరుణ్ నుర అనే యూజర్ షేర్ చేసిన పోస్టుకు కామెంట్ చేశారు. "ఏమైనప్పటికీ ఈ అద్భుతమైన వ్యక్తులు ఇలా దుస్తులు ధరించి ఏమి చేస్తున్నారు?" అని శశి థరూర్ రాసుకొచ్చారు. దీనికి "సందర్భం ఉందా? వివరణ ఉందా ?" అని కామెంట్ చేశారు.

అరుణ్ నురా కొన్ని ప్రత్యేకమైన చిత్రాలను పోస్ట్ చేశారు. వీటిలో బ్యాట్ మ్యాన్, వండర్ ఉమెన్,  ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఫొటోలను ఆసక్తికర ఫోజుల్లో ఉన్న ఫొటోలను షేర్ చేశారు. వీటితో పాటు తన పంటలపై గబ్బిలాలు దాడి చేస్తున్నాయని బ్యాట్ మ్యాన్ ఆందోళన చెందుతున్నాడని, బట్టలు ఉతకడానికి వండర్ ఇబ్బంది పడుతోందని రాసుకొచ్చారు. సూపర్‌మ్యాన్ ధాబాలో కూర్చొని బాధపడుతున్నట్టుగా, ఐరన్ మ్యాన్ తన చేతిలో కర్రతో ఒక సరస్సు దగ్గర కూర్చున్నట్లుగా అడ్మిన్ రాసుకొచ్చారు.