శశికళకు కరోనా.. ఐసీయూలో చికిత్స

శశికళకు కరోనా.. ఐసీయూలో చికిత్స

మిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు, అమ్మ మక్కల్ మున్నెట్ర కజగం పార్టీ అధ్యక్షురాలు వీకే శశికళ అనారోగ్యంతో బెంగుళూరు విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడటంతోపాటు, వెన్నునొప్పి సమస్యలతో కొన్ని రోజుల క్రితం బౌరింగ్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ ఆమెకు రెండుసార్లు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా కరోనా నెగిటివ్ వచ్చింది. దాంతో సీటీ స్కాన్ చేయాలని వైద్యులు సూచించారు. బౌరింగ్ ఆస్పత్రిలో సీటీ స్కాన్ లేకపోవడంతో విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ సీటీ స్కాన్ చేయగా.. ఆమెకు కరోనా ఉన్నట్లు తేలింది. అయితే శశికళకు కరోనాతో పాటు డయాబెటిస్, హైపర్ టెన్షన్, హైపోథైరాయిడజమ్ జబ్బులు ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఆక్సీజన్‌తో శ్వాస తీసుకుంటున్నారని ఆమె మేనల్లుడు టీటీ దినకరన్ తెలిపారు.

అక్రమాస్తుల కేసులో 2016లో అరెస్టయిన శశికళ.. పరప్పణ అగ్రహారం జైలులో గత నాలుగేళ్లుగా శిక్ష అనుభవిస్తున్నారు. ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు మేరకు రూ. 10 కోట్లు జరిమానా చెల్లించి ఏడాది ముందుగానే విడుదలకానున్నారు. ఈ ఏడాదిలో తమిళనాడులో ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు విడుదలై.. తమ పార్టీని పోటీలో నిలపాలని శశికళ భావించింది. కానీ.. అనూహ్యంగా విడుదలకు ముందు ఆమె ఆరోగ్యం క్షీణించడం.. ఆస్పత్రి పాలవడం.. ఆమె పార్టీ కార్యకర్తలను కుంగేలా చేసింది.

For More News..

వీడియో: భీకర పోరు తర్వాత పులికి లొంగిన మరో పులి

దారుణం: డైనమైట్స్ లారీలో పేలుడు.. 15 మంది మృతి.. ఎగిరిపడ్డ శరీర భాగాలు