
హైదరాబాద్ : గణేష్ ఉత్సవాల్లో పౌరులు, ప్రత్యేకించి మహిళల భద్రత పై స్పెషల్ ఫోకస్ పెట్టారు హైదరాబాద్ పోలీసులు. గణేష్ ఉత్సవాల్లో మహిళలతో అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తులపై హైదరబాద్ షీ టీమ్స్ నజర్ పెట్టింది. ఖైరతాబాద్ బడా గణేష్‌ను దర్శించుకున్నేందుకు వచ్చిన మహిళలను వేధించిన 285 మంది ఆకతాయలను షీ టీమ్ పోలీసులు పట్టుకున్నారు. గడిచిన ఏడు రోజుల్లో 285 మంది ఆకతాయిలు యువతులు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు వచ్చాయని షీ టీం పోలీసులు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ALSO READ :ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు