
డ్రై ఫ్రూట్స్ అనగానే మనకు గుర్తుకు వచ్చేవి బాదం, జీడిపప్పు, పిస్తా, ఎండుద్రాక్ష, వాల్‌నట్‌లు, ఖర్జూరం లాంటివి. ఇవి చాలా పోషకాలతో నిండిన ఆహారం.ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే డ్రై ఫ్రూట్స్ ధరలు విపరీతంగా పెరిగాయి. కేవలం 3 వారాల్లోనే కొనుగోలు దారులకు అంతనంత స్థాయికి పెరిగిపోయాయి. సాధారణ ధరలకంటే డబుల్ అయ్యాయి. ప్రీమియం బ్రాండ్స్ అయితే మరి దారుణం..కిలో కాదు కదా పావుకిలో కూడా కొనలేని పరిస్థితి.. ఇంతలా డ్రైప్రూట్స్ ధరలు పెరగడానికి కారణం ఏంటీ?..
అది ఢిల్లీలోని డ్రైఫ్రూట్ మార్కెట్..ఎప్పుడు జనంతో రద్దీగా ఉండే మార్కెట్..రకరకాల డ్రైఫ్రూట్స్ పెట్టింది పేరు. ఒకప్పుడు బయ్యర్స్ బేరసారాలతో.. వ్యాపారుల కొసరుతో కోలాహలాంగా ఉండేది..ఇప్పుడు అంతా నిశ్శబ్దం..మూడు వారాలుగా డ్రైఫ్రూట్స్ ధరలు రెట్టింపు అయ్యాయి. గతంలో కిలో కొనేవారు ఇప్పుడు ధరలు చూసి కొనకుండానే వెళ్లిపోతున్నారు. డ్రైఫ్రూట్స్ ధరలు ఎందుకు ఒక్కసారిగా పెరిగాయి..అంతపెద్ద మార్కెట్ బిజినెస్ లేకుండా నిశ్శబ్దంగా ఉంది.
ఓల్డ్ ఢిల్లీలోని చారిత్రాత్మక ఖరీ బావోలీ మార్కెట్ లో.. పెరుగుతున్న భారత్ , పాక్ ఉద్రిక్తతల మధ్య వ్యాపారం దాదాపు స్తంభించిపోయింది.సరిహద్దులు మూసివేయడం,సరుకులు మార్గమధ్యలో ఉండటం, భారత దేశ డ్రైఫ్రూట్స్ వాణిజ్యం తీవ్ర సంక్షోభంలో పడింది. విపరీతంగా ధరలు పెరిగింది వినియోగదారులకు డ్రైఫ్రూట్స దూరం అవుతున్నాయి.
దిగుమతులు లేకపోవడంతో డ్రైప్రూట్స్ ధరలు విపరీతంగా పెరిగాయి. కిలోకు రూ. 300 నుంచి 400 వరకు పెరిగాయి. కొన్ని ప్రీమియం రకాల ధరలు వినియోగదారులకు అందనంతగా పెరిగాయి. మఖానా కిలో ధర 1800 లు పలుకుతోంది. ఇది సాధారణ రేటుకంటే రెట్టింపు. ఇంతకుముందు ప్రజలు అర కిలో కొనేవారు.. కొన్నిసార్లు ఎక్కువగా నే కొనేవారు. ఇప్పుడు కొనేవారే లేరు అని వ్యాపారులు వాపోతున్నారు.
సరఫరా లేకపోవడంతో ఆ ప్రభావం కేవలం మూడు వారాల్లోనే ఎండిన పండ్ల ధరలలో 20శాతం నుంచి 40శాతం పెరుగుదలకు కారణమైంది. బాదం రూ. 400నుంచి 600 ల మధ్య ఉన్న ధరలు ఏకంగా 1040 రూపాలకు పెరిగాయి. రూ. 550 లున్న జీడిపప్పు 1200లకు పెరిగింది. కిలో రూ.1100 ఉన్న అంజీర్ ఇప్పుడు రూ1900పలుకుతోంది. వాల్నట్స్ రూ. 600 నుంచి 1600లకు పెరిగాయి.
ఒకప్పుడు కొనుగోలుదారులతో కళకళలాడే ఖరీ బావోలీ డ్రైఫ్రూట్స్ మార్కెట్ వెలవెలబోయింది. భౌగోళిక రాజకీయ సంఘర్షణల ప్రభావంతో సరుకు రాక, వ్యాపారం లేక నిశ్శబ్దంగా మారింది.
ఒకప్పుడు డ్రైఫ్రూట్స్ వ్యాపారంఖరీ బావోలి డ్రైఫ్రూట్స్ మార్కెట్లో పరిస్థితి పెద్ద ఆర్థిక దుర్బలత్వాన్ని ప్రతిబింబిస్తుంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలుతగ్గి కొద్ది రోజుల్లో సరుకులు సరఫరా అయితే ధరలు తగ్గే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు.