
క్రికెట్ లో ఒంటరి పోరాటం అంటే వెస్టిండీస్ మహిళల కెప్టెన్ హేలీ మాథ్యూస్ కే సాధ్యం అనేలా ఉంది. జట్టు మొత్తం విఫలమైనా ఆమె మాత్రమే ఒంటి చేత్తో జట్టును ముందుకు నడిపిస్తుంది. గతంలో ఇలాంటి సందర్భాలు ఎన్నో జరిగాయి. బుధవారం (మే 21) ఇంగ్లాండ్ మహిళలతో జరిగిన మ్యాచ్ లో మరోసారి మాథ్యూస్ తన పట్టుదలను చూపించింది. సెంచరీతో వెస్టిండీస్ పరువు కాపాడింది. కాంటర్బరీలో జరిగిన తొలి టీ20లో 67 బంతుల్లో 16 ఫోర్లు.. ఒక సిక్సర్ తో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.
హేలీ మాథ్యూస్ కు టాప్ ఇన్నింగ్స్ తో మొదట బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. 146 పరుగులో మాథ్యూస్ 100 పరుగులు చేయడం విశేషం. జట్టు స్కోర్ లో 70 శాతం పరుగులు చేయడం హైలెట్ గా మారింది. ఆరు పరుగులు ఎక్స్ ట్రాల రూపంలో వచ్చాయి. మిగిలిన బ్యాటర్లు అందరూ కలిపి కేవలం 40 పరుగులే చేశారు. వికెట్ కీపర్ మాండీ మంగ్రూ 16 బంతుల్లో 17 పరుగులతో రెండవ అత్యధిక స్కోరర్‌గా నిలిచింది. డియాండ్రా డాటిన్, చినెల్లే హెన్రీ లేకపోవడం విండీస్ జట్టుకు ప్రతికూలంగా మారింది.
ఈ విండీస్ కెప్టెన్ రికార్డు స్థాయిలో అజేయంగా చేసిన సెంచరీ వృధా అయింది. ఇంగ్లాండ్ 147 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.3 ఓవర్లలోనే ఛేదించి ఎనిమిది వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. సోఫియా డాంక్లి 83 పరుగులు చేసి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించింది. హీథర్ నైట్ కీలక ఇన్నింగ్స్ ఆడింది. విండీస్ జట్టు మ్యాచ్ ఓడిపోయినా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సెంచరీతో మెరిసిన హేలీ మాథ్యూస్ కే దక్కింది.
Incredible Hayley Matthews with another 💯
— Women’s CricZone (@WomensCricZone) May 22, 2025
(via FanCode) | #ENVvWIpic.twitter.com/89V8F0qVqr