
యూరోపియన్ దేశమైన గ్రీస్ లో భారీ భూకంపం సంభవించింది. తీరప్రాతంలో వచ్చిన ఈ భారీ భూకంపంతో గ్రీస్ లోని కొన్ని ప్రంతాల్లో భూమి కంపించినట్లుగా అధికారులు తెలిపారు. గురువారం (మే 22) ఉదయం ఉదయం వచ్చిన ఈ భూకంప్రనల కారణంగా సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో గ్రీస్ తో పాటు పొరుగు దేశాలు అలర్ట్ ను ప్రకటించాయి.
క్రీట్ తీర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ ప్రకటించింది. పాపులర్ టూరిస్ట్ స్పాట్ అయినటువంటి యూలొండాకు 58 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉందని.. ఉపరితలం నుంచి 77 కిలోమీటర్లలో నమోదైందని యూఎస్ జియోలజికల్ సర్వే విభాగం ప్రకటించింది. ఈ ప్రమాదంలో ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించిన అధికారిక డేటా ఇంకా విడుదల చేయలేదు.
భూకంప ప్రభావాన్ని బట్టి స్థానికంగా 100 లోపు సునామీ వచ్చే అవకాశం ఉందని, ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటే వెయ్యి కిలోమీటర్ల తీరప్రాంత పరిధిలో వ్యాపించే అవకాశం ఉందని యూరోపియన్-మధ్యధరా ప్రాంత భూకంప కేంద్రం తెలిపింది.
గ్రీస్ ను భయపెడుతున్న వరుస భూకంపాలు:
గత వారంలో దక్షిణ తీరంలో భారీ భూకంపం సంభవించడంతో హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. 2025, మే 13న 6.1 తీవ్రతతో కాసోస్ ఐలాండ్ లో భూకంపం సంభవించింది. ఈ భూకంపంతో దక్షిణ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. పొరుగు దేశాలైన టర్కీ, ఈజిప్టు, లెబనాన్, ఇజ్రాయెల్ లో ఈ భూకంప తీవ్రతకు కొన్ని కట్టడాలు నేలమట్టం అయ్యాయి.
గ్రీస్ ప్రాంతం భూకంప ప్రభావిత ప్రాంతం కావడంతో తరచుగా భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. 26 జనవరి నుంచి 13 ఫిబ్రవరి మధ్యలోనే 18 వేలకు పైగా ప్రకంపనలు వచ్చినట్లు ఏథెన్స్ సిస్మాలజీ ల్యాబొరేటరీ పేర్కొంది.
ఇవాళ (గురువారం) సంభవించిన భూకంపంతో టూరిస్టులకు హెచ్చరికలు జారీ చేశారు. సునామీ వచ్చే అవకాశం ఉండటంతో యాత్రలను వాయిదా వేసుకోవాలని సూచించారు.