రద్దీ ప్రదేశాల్లో వెకిలి చేష్టలు ...187 మందిని అరెస్టు చేసిన షీ టీమ్స్

రద్దీ ప్రదేశాల్లో వెకిలి చేష్టలు ...187 మందిని అరెస్టు చేసిన షీ టీమ్స్

ఎల్బీనగర్, వెలుగు: రద్దీ ప్రదేశాల్లో బాలికలు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న పోకిరీలను షీ టీమ్స్​ అదుపులోకి తీసుకున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ సుధీర్ బాబు బుధవారం వెల్లడించారు. సోషల్ మీడియాతో పాటు రద్దీ ప్రాంతాల్లో మైనర్లు, మహిళలతో ఆసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు రాచకొండ కమిషనరేట్ పరిధిలో 15 రోజుల్లో 217  ఫిర్యాదులు వచ్చాయి. షీ టీములు మఫ్టీల్లో నిఘా పెట్టి 187 మందిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం వారికి పేరెంట్స్ సమక్షంలో కౌన్సెలింగ్​ ఇచ్చారు. నిందితుల్లో 107 మంది మైనర్లు ఉండడం గమనార్హం. ఎక్కడైనా వేధింపులకు పాల్పడితే 87126 62111 వాట్సాప్​ నంబర్​కు ఫిర్యాదు చేయాలని కమిషనర్​ సూచించారు.