ప్రేమ జంటలకు షీ టీమ్స్ జరిమానా

ప్రేమ జంటలకు షీ టీమ్స్ జరిమానా
  • పబ్లిక్​ ప్లేసెస్​లో న్యూసెన్స్ చేస్తుండగా షీ టీమ్స్​ వార్నింగ్​

హైదరాబాద్​, వెలుగు: పబ్లిక్ ప్లేసెస్​లో అసభ్యంగా ప్రవర్తించిన ప్రేమ జంటలకు షీ టీమ్స్ జరిమానా విధించారు. బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రేమజంటలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ప్రజల నుంచి కంప్లైంట్స్​ రావడంతో షీ టీమ్స్​ రంగంలోకి దిగింది. అలాంటి వారిని గుర్తించేందుకు స్పెషల్​ ఆపరేషన్లు నిర్వహించింది.  

పార్కులు, బస్టాండ్​లు, బస్సులు, రైల్వే స్టేషన్లు, రోడ్ల మీద అసభ్యంగా ప్రవర్తిస్తున్న 12 మంది  ప్రేమికులను గుర్తించి వీడియోల్లో రికార్డు చేసింది.  ఆయా జంటలపై  70(బీ)290 ఐపీసీ 188 సీపీ యాక్ట్​ కింద కేసులు నమోదు చేసి రూ. 1,250  ఫైన్ విధించింది.