మఫ్టీలో షీ టీమ్స్

మఫ్టీలో షీ టీమ్స్

నిమిషాల్లో మీ ముందుంటాం
ఈవెంట్స్ పై నిఘా
ఈవ్ టీజర్లు, పోకిరీలపై ఫోకస్
హాట్ స్పాట్స్‌ను గుర్తించిన విమెన్ కాప్స్
60 షీ టీమ్స్‌తో ఆపరేషన్స్

‘‘దిశ ఘటన నేపథ్యంలో విమెన్ సెక్యూరిటీపై అలర్ట్‌గా ఉన్నాం. సెలబ్రేషన్స్ మానిటరింగ్‌కు షీ టీమ్స్ ఆధ్వర్యంలో 60 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. సిబ్బంది మఫ్టీలో ఉంటారు. ఇల్లీగల్ యాక్టివిటీస్‌కి అవకాశమున్న స్పాట్స్‌పై నిఘా పెట్టాం. సెలబ్రేషన్స్‌కు వెళ్లే విమెన్స్ కూడా జాగ్రత్తలు పాటించాలి. ఎక్కడైనా, ఎవరైనా వేధిస్తే వెంటనే 100 డయల్ చెయ్యండి. సిటీ పోలీస్ వాట్సాప్ నంబర్ 9490616555కి మెసేజ్ పెట్టండి. హాక్ ఐ యాప్‌లోని ఎస్ఓఎస్ ప్రెస్ చేస్తే నిమిషాల వ్యవధిలో పోలీసులు మీ ముందుంటారు.’’ సిటీ అడిషనల్ సీపీ( క్రైమ్స్), షీ టీమ్స్ ఇన్ చార్జి శిఖాగోయల్

హైదరాబాద్, వెలుగు: న్యూ ఇయర్ వేడుకలకు అంతా సిద్ధమైంది. ఈవెం ట్స్‌లో మంగళవారం రాత్రి 9 గంటల నుంచే పాల్గొనేందుకు యువత ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం సిటీలోని పబ్స్, స్టార్ హోటల్స్ నిర్వాహకులు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. ఐతే ఈవెం ట్స్‌లో యువతులు, మహిళలు కూడా పాల్గొనే అవకాశాలు ఉండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన నేపథ్యంలో విమెన్ సేఫ్టీ కోసం స్పెషల్ ప్రికాషన్స్ తీసుకున్నారు. హైదరాబాద్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో 60 స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశారు. దీంతో పాటు పోలీసుల అనుమతులు ఉన్న ఈవెంట్స్‌లో విమెన్ సేఫ్టీ బాధ్యతను
పూర్తిగా నిర్వాహకులకే అప్పగించారు. ఈవెంట్స్‌లో పాల్గొనే యువతులు, మహిళల కోసం తీసుకోవాల్సిన సేఫ్టీపై ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ప్రతి ఈవెంట్‌ను హైడెఫినిషన్ డిజిటల్ కెమెరాలతో షూట్ చేయాలని పర్మిషన్ కండిషన్స్‌లో పేర్కొన్నారు. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా, మహిళలపై వేధింపులు జరిగినా నిమిషాల వ్యవధిలోనే షీ టీమ్స్ స్పాట్‌కు చేరుకునేందుకు ప్లాన్ రెడీ చేశారు. ఈ నేపథ్యం లో హైదరాబాద్ అడిషనల్ సీపీ, క్రైమ్స్, షీ టీమ్స్ ఇన్ చార్జి శిఖాగోయల్‌తో ‘వెలుగు’ స్పెషల్ ఇంటర్వ్యూ.

వెలుగు: సిటీలో న్యూఇయర్ ఈవెం ట్స్ ఎక్కువగా ఎక్కడ జరుగుతున్నాయి? మహిళల భద్రతకు మీరు ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారు?
శిఖాగోయల్ అడిషనల్ సీపీ, క్రైమ్స్: దిశ ఘటన నేపథ్యంలో లాస్ట్ ఇయర్ కంటే ఈ సారి న్యూఇయర్ ఈవెంట్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టాం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఉండేందుకు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నాం. అందుకోసం ఈ నెల ఫస్ట్ వీక్‌లోనే స్టార్ హోటల్స్, పబ్స్,ఈవెంట్ నిర్వాహకులతో సీపీ సమావేశం నిర్వహించారు. మా కమిషనరేట్ పరిధిలోని వెస్ట్ జోన్‌లో ఈవెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌తో పాటు ఎస్సార్ నగర్, పంజాగుట్ట, బేగంపేట్‌లలో సుమారు 68 వరకు నిర్వాహకులు పర్మిషన్స్ తీసుకున్నారు. నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం . చిన్న పొరపాటు జరిగినా వాళ్లదే బాధ్యత. ఈవెంట్స్ డార్క్ లైటింగ్‌లో కాకుండా స్పష్టమైన వెలుతురులోనే జరిగేలా లైటింగ్ ఎరేంజ్‌మెంట్ చేయాలని చెప్పాం. దీంతో పాటు సెలబ్రేషన్స్ జరిగే ఏరియాల్లోని ఎంట్రీస్, ఎగ్జిట్స్, పార్కింగ్ ప్లేసుల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దగ్గర్నుం చి పూర్తి అయ్యే వరకు వీడియో రికార్డింగ్ తప్పనిసరి చేశాం. సీసీ టీవీ ఫుటేజ్ డేటాను తప్పనిసరిగా భద్రపరచాలి.

వెలుగు: పబ్స్, స్టార్ హోటల్స్‌లో జరిగే ఈవెంట్స్‌లో యువతులకి ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు?
శిఖాగోయల్: దీనిపై అన్ని వింగ్స్‌తో కలిసి డిస్కస్ చేశాం . ప్రధానంగా ఈవెం ట్స్‌కి ఎక్కువగా కపుల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిని మాత్రమే ఇన్‌సైడ్ అనుమతించేలా గైడ్ లైన్స్ జారీచేశాం. దీంతో పాటు ఈవెంట్‌లోకి ఎంటర్ అయ్యే ప్రతి ఒక్కరి యాక్టివిటీని గమనించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలని నిర్వాహకులకు సూచించాం.

వెలుగు: ఇన్ సైడ్ ఈవెం ట్, ఔట్ సైడ్ జరిగే సెలబ్రేషన్స్‌లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? ఎన్ని షీటీమ్స్ ఆన్ డ్యూటీలో ఉంటాయి?
శిఖాగోయల్: అందుకోసం 60 షీ టీమ్స్‌ను ఏర్పాటు చేశాం . ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు షీటీమ్స్ కూడా ఆన్ డ్యూటీలో ఉంటాయి. రాత్రి 9 గంటల నుంచే యువతులు ఈవెంట్స్‌లో పాల్గొనడానికి వస్తారు కాబట్టి ఈవెంట్స్ జరిగే అన్ని ఏరియాల్లో నిఘా పెట్టాం . ఒక్కో షీటీమ్‌లో ఎస్సై తో పాటు
మహిళా కానిస్టే బుల్, మరో ఇద్దరు కానిస్టే బుల్స్ ఉంటారు. దీంతో పాటు పబ్స్, హోటల్స్, సిటీలోని పబ్లిక్ ప్లేసెస్ లో ‘‘డయల్ 100’’ ‘‘హాక్ ఐ”డిస్ల్పే బోర్డులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నాం.

వెలుగు: న్యూఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకునే మహిళలు, ఈవెం ట్స్‌కి వెళ్ళే యువతులకు మీరు ఎలాంటి సూచనలు చేస్తున్నారు?
శిఖాగోయల్: సెలబ్రేషన్స్ లో పాల్గొనే ప్రతి విమెన్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పబ్స్, హోటల్స్, రిసార్స్ట్ లో జరిగే ఈవెంట్స్ కి వెళ్లేయువతులు ఇంట్లో ముందస్తు సమాచారం ఇవ్వాలి. దీంతో పాటు సిటీ కాలనీల్లో జరుపుకునే సెలబ్రేషన్స్‌లో ఎవరైన వేధిస్తే మాకు సమాచారం ఇవ్వాలి. మద్యం మత్తులో పోకిరీలు రెచ్చిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి…మీ చుట్టూ ఉన్న వారి పట్ల అలర్ట్‌గా ఉండాలి. ఎవరైనా వెంబడించినా, వేధించినా వెంటనే డయల్ 100 కానీ అక్కడే ఉన్న పోలీసులకు కానీ సమాచారం ఇవ్వాలి. దీంతో పాటు సిటీ పోలీస్ వాట్సాప్ నంబర్ 9490616555 కి సమాచారం అందించాలి. లొకే షన్ షేర్ చేయాలి. దీంతో పాటు అత్యవసర పరిస్థితిలో ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేయాలి.