ఇంద్రాణి ముఖర్జీ బయటకొస్తే సాక్షులను బెదిరిస్తుంది

 ఇంద్రాణి ముఖర్జీ బయటకొస్తే సాక్షులను బెదిరిస్తుంది

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకించింది సీబీఐ. ఆమె బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది సీబీఐ. ఇంద్రాణి ముఖర్జీ బయటకు వస్తే సాక్షులను బెదిరించి కేసును పక్కదోవ పట్టించే అవకాశం ఉందని తెలిపింది. ఆమె కన్న కూతురిని హత్యచేసిందని..కొడుకును కూడా చంపేందుకు ప్రయత్నించిందని అఫిడవిట్ లో పేర్కొంది. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తి అని..సాక్షులను ఇంకా విచారించాల్సింది ఉందని తెలిపింది. ఆమెకు బెయిల్ మంజూరు చేస్తే తన పలుకుబడిని ఉపయోగించి తప్పించుకుపోతుందనే అనుమానాలు ఉన్నాయన్నారు. సీబీఐ అఫిడవిట్ పై  సమాధానం ఇవ్వాలని ఇంద్రాణీముఖర్జీకి రెండు వారాల గడువు ఇచ్చింది న్యాయస్థానం.

మరిన్ని వార్తల కోసం