RT76: శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ.. ఆషికా రంగనాథ్తో రవితేజ స్టెప్పులు

RT76:  శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ.. ఆషికా రంగనాథ్తో రవితేజ స్టెప్పులు

రీసెంట్‌‌‌‌గా ‘మాస్ జాతర’ చిత్రంతో  ప్రేక్షకుల ముందుకొచ్చిన రవితేజ.. తన నెక్స్ట్ ప్రాజెక్టుతో బిజీ అయ్యాడు.  కిశోర్ తిరుమల డైరెక్షన్‌‌‌‌లో ఆయన ఓ మూవీ చేస్తున్న  సంగతి తెలిసిందే.  ఆషికా రంగనాథ్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది.  ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. స్పెయిన్ సహా విదేశాల్లో పాటలను  చిత్రీకరించారు.  తాజాగా నెక్స్ట్ షెడ్యూల్‌‌‌‌ను హైదరాబాద్‌‌‌‌లో స్టార్ట్ చేశారు. ఈ షెడ్యూల్‌‌‌‌లో మరో  సాంగ్‌‌‌‌ను షూట్ చేస్తున్నట్టు తెలియజేశారు మేకర్స్. 

అన్నపూర్ణ స్టూడియోస్‌‌‌‌లో వేసిన  స్పెషల్ సెట్‌‌‌‌లో రవితేజ, ఆషిక జోడీపై ఈ పాటను షూట్ చేస్తున్నారు.  శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రూపొందుతున్న ఈ సాంగ్  అదిరిపోయే డ్యాన్స్ నంబర్‌‌‌‌గా ప్రేక్షకులను అలరించనుందని మేకర్స్ చెప్పారు.   రవితేజ నటిస్తోన్న 76వ సినిమా ఇది.  ఈ చిత్రం కోసం ఆయన   స్టైలిష్‌‌‌‌గా మేకోవర్ అయ్యాడు.  అలాగే ఆయన  మార్క్  కామిక్ టైమింగ్, మాస్ అప్పీల్‌‌‌‌తో కూడిన ఫుల్ లెంగ్త్  ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు దర్శకుడు కిషోర్ తెలియజేశాడు. 

ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌వీ  సినిమాస్ బ్యానర్‌‌‌‌పై  సుధాకర్ చెరుకూరి  నిర్మిస్తున్న  ఈ చిత్రానికి ‘అనార్కలి’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే  ప్రకటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.  టైటిల్, ఫస్ట్ లుక్, ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.