ధవన్ అర్ధ సెంచరీ.. దీటుగా బదులిస్తున్న భారత్

V6 Velugu Posted on Jan 23, 2022

కేప్‌టౌన్: సౌతాఫ్రికా నిర్దేశించిన 288 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్.. దీటుగా బదులిస్తోంది. 18 పరుగులకే కెప్టెన్ కేఎల్ రాహుల్ (9) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మాజీ సారథి విరాట్ కోహ్లీతో కలిసి మరో ఓపెనర్ శిఖర్ ధవన్ నిదానంగా ఆడుతూ క్రీజులో కుదురుకున్నాడు. ఆ తర్వాత బ్యాట్ ఝళిపించాడు.ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో ధవన్‌కు ఇది రెండో అర్ధ సెంచరీ. మరోవైపు, గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న కోహ్లీ ఎలాంటి భారీ షాట్లకు పోకుండా నెమ్మదిగా ఆడుతూ ధవన్‌కు అండగా నిలుస్తున్నాడు. 21 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 113 పరుగులు చేసింది. ధవన్ 59, కోహ్లీ 41 పరుగులతో క్రీజులో ఉన్నారు.
 

Tagged sports, Shikhar Dhawan, half centurty

Latest Videos

Subscribe Now

More News