మహా తీర్పు..రేపటికి వాయిదా

మహా తీర్పు..రేపటికి వాయిదా

మహారాష్ట్ర అంశంపై  దాఖలైన పిటిషన్ పై  సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి.  బీజేపీ తరపున ముకుల్ రోహత్గి, కాంగ్రెస్,శివసేన,ఎన్సీపీ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్నసుప్రీం తీర్పును రిజర్వ్ చేసింది. తుది తీర్పును రేపు(26) ఉదయం 10.30 గంటలకు వాయిదా వేసింది.

వేకువజామున రాష్ట్రపతి పాలనను ఎత్తివేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు కపిల్ సిబల్. ఎన్సీపీ,కాంగ్రెస్,శివసేన కూటమికి 154 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని..24 గంటల్లో బలపరీక్ష జరపాలని సూచించారు. ఒకవేళ బీజేపీ కూటమికి ఎమ్మెల్యేల మద్దతు ఉంటే బలపరీక్షకు ఎందుకు భయమని ప్రశ్నించారు. అయితే బీజేపీ తరపున వాదనలు వినిపించిన ముకుల్.. అజిత్ పవార్ 54 మంది ఎమ్మెల్యేల సంతకాలతో మద్దతుందని లేఖ ఇచ్చారని .. దీంతో తమకు 170 మంది మద్దతుందని ప్రభుత్వ ఏర్పాటుకు ఆదేశించాలని గవర్నర్ ను దేవేంధ్ర ఫడ్నవిస్ కోరారన్నారు. మెజారిటీ ఆధారంగానే గవర్నర్ ఫడ్నవిస్ ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని అన్నారు. 24 గంటల్లో  బలపరీక్షను జరపలేమన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం తుదీ తీర్పు 26 ఉదయం 10.30 గంటలకు వెల్లడిస్తామని చెప్పింది.